"money is more powerful than Lord Ram" శ్రీరాముడి కన్నా డబ్బుకే ప్రాధన్యామన్న అర్ఎస్ఎస్ నేత

Rss leader claims money is more powerful than ram

GOA, manohar parikar, manohar parikar cabinet, manohar parikar health, Panaji, rss, subhash velingkar, subhash velingkar attack on manohar parikar, politics

Former Goa RSS chief Subhash Velingkar claimed even Lord Ram would ... will not get elected if he doesn't spend money," Velingkar claimed.

‘‘శ్రీరాముడే వచ్చినా డబ్బు పంచకుండా నెగ్గలేడా.?’’

Posted: 09/27/2018 04:13 PM IST
Rss leader claims money is more powerful than ram

రాముడే విశ్వానికి అది అంతం.. అయన లేనిదే ఏమీ లేదన్న సిద్దాంతాన్ని ఫాలో అవుతున్న అర్ఎస్ఎస్ గోవా మాజీ ఛీఫ్.. తమ సిద్దాంతాలకు బద్ద విరుద్దంగా సంచలన వాఖ్యలు చేశారు. రాముడు దేవుడని, ఆయన తలుచుకుంటే ఏమైనా జరగవచ్చని.. ఆర్ఎస్ఎస్ సభలు, సమావేశాల్లో చెప్పిన నేత.. ఇప్పడు తన మాటను మార్చుతూ.. రాముడి కన్న డబ్బే గొప్పదని వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాముడైనా సరే ఎన్నికల్లో డబ్బులు పంచకపోతే గెలవలేడని సుభాష్ వెలింగ్కర్ అన్నారు‌.

పనాజీలో గోవా సురక్ష మంచ్‌ యువ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారాయి. రాముడు పేరు చెప్పుకుని రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఏకపక్షంగా అధికారంలోకి వచ్చిన పార్టీ ఇవాళ దేశంలోని 21 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ మాజీ ఛీప్ రాముడినే కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారుతుంది. పనాజీలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెట్టింట్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు రెండు వర్గాల ప్రజలను ఆకర్షిస్తారని, వారిలో ఒకటి యువత కాగా రెండవది మహిళలని అన్నారు. తమపై నమ్మకం కల్గించేందుకు నాయకులు వీరికి డబ్బు, గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఎన్నికల్లో డబ్బుకు అధిక ప్రాబల్యం ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో రాముడొచ్చి పోటీ చేసినా.. డబ్బు ఖర్చు పెట్టకపోతే ఆయన గెలవలేరన్నారు సుభాష్. వారిని ఆకట్టుకోవడానికి పార్టీలు ఎంత డబ్బునైనా ఖర్చు పెడతాయన్నారు. అయినా ఇప్పటి రాజకీయాలన్ని డబ్బు చూట్టే తిరుగుతున్నాయని… డబ్బు లేకపోతే ఎన్నికల్లో గెలవడం చాలా కష్టమన్నారు సుభాష్ వెలింగ్కర్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GOA  manohar parikar  Panaji  rss  subhash velingkar  politics  

Other Articles