Telangana CM KCR Press Meet after dissolution of Assembly తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే : కేసీఆర్

Telangana cm kcr press meet after dissolution of assembly

K. Chandrasekhara Rao, TRS, KCR, Telangana, Telangana Assembly dissolution, E.S.L. Narasimhan, Narsimhan approves Telangana assembly dissolution, cabinet meet, Telangana cabinet meet, Telangana, Politics

Telangana Chief Minister K. Chandrasekhar Rao first press meet from telangana Bhavan the party office of the Ruling party, after the dissolution of the Legislative Assembly.

తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే : కేసీఆర్

Posted: 09/06/2018 03:02 PM IST
Telangana cm kcr press meet after dissolution of assembly

తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీ రద్దుకు పూనుకున్నామని ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తన నిర్ణయానికి సహకరించిన నేతలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్న తరువాత తొలిసారిగా తెలంగాణ భవన్ నుంచి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ అసహన వైఖరి పెరిగిపోతుందని అన్నారు. కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చి, పనికి మాలిన దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ.. ప్రగతిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ప్రతిఫక్షాలు ఇష్టమొచ్చిన రీతిలో అవాకులు చెవాకులు పేలుతున్నాయని ఆరోపించారు. నియంతృత్వ విధానంలో, క్రమశిక్షణతో వెళితేనే నాలుగేళ్లలో తెలంగాణ అభివృద్ధి సాధ్యం అయ్యిందన్నారు. 50 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ నేతలు పాత్రధారులుగా ఉన్నారని.. అన్నీ ధ్వంసం అయ్యాయన్నారు. వాటన్నింటినీ సరిచేసుకుని వెళుతుంటే అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉద్యమ స్థాయి నుంచి ప్రారంభమైన తమ పార్టీ అనేక త్యాగాలు.. పోరాటాలు చేసిందని చెప్పుకోచ్చారు.

నాలుగేళ్లుగా రాష్ట్ర వృద్ధిరేటు 17శాతానికిపైగా ఉందని చెప్పిన కేసీఆర్.. గడిచిన ఐదు నెలల్లోనే రికార్డ్ స్థాయిలో 21.96 రేటుతో రాష్ట్ర ప్రగతి సాధించామని తెలిపారు. ఇండియాలోనే అభివృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం నంబెర్ వన్ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో కొనియాడారని సీఎం అన్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు 40 అవార్డులు వచ్చాయని తెలిపారు.

నీటి కోసం మిషన్ కాకతీయ చేపట్టినా, మిషన్ భగీరధ చేపట్టినా విపక్షాలు అరోపణలు చేస్తున్నాయని అన్నారు. అయితే ఒక్క అరోపణను రుజువు చేయని కాంగ్రెస్.. వాటిని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులను కూడా వేశాయని అరోపించారు. ఇక చత్తీస్ గడ్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ విషయంలోనూ అరోపణలు చేయడం వారి అవివేకానికి దర్పణం పడుతుందన్ని అన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సమస్యలతో అల్లాడిన ప్రజలకు నాలుగేళ్లలోనే నిరంతర విద్యుత్ ను అందించిన ఘనత తమదని అన్నారు.

రాష్ట్రంలోని రైతాంగానికి నిరంత ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. చిత్తశుద్దితో పనిచేసిన తమ ప్రభుత్వం విద్యుత్ కష్టాలను తొలగించిందని సీఎం అన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో పెట్టని అనేక పథకాలను కూడా అవగాహన చేసుకుని తాము అమలు పర్చామని చెప్పారు కేసీఆర్. ప్రతిపక్షాలకు అవగాహన, పరిజ్ఞానం లేదని సీఎం అన్నారు. పథకాలను విమర్శించే వాళ్లు దద్దమ్మలన్నారు. తెలంగాణలో ఇప్పుడు లాఠీ చార్జీలు లేవని సీఎం అన్నారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అన్నీ కులాల, మతాలను సమానంగా గౌరవించామని సీఎం అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణలో ఉన్నంత ప్రశాంతత దేశంలో మరెక్కడా లేదని చెప్పారు కేసీఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles