governor approves Telangana Assembly dissolution తెలంగాణ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అమోదం..

Cm kcr dissolves telangana assembly approves governor

K. Chandrasekhara Rao, TRS, KCR, Telangana, Telangana Assembly dissolution, E.S.L. Narasimhan, Narsimhan approves Telangana assembly dissolution, cabinet meet, Telangana cabinet meet, Telangana, Politics

Telangana Chief Minister K. Chandrasekhar Rao has dissolved the Legislative Assembly after Conducting a meeting of his Council of Ministers on Thursday and seek fresh elections six months ahead of schedule.

తెలంగాణ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ ఆమోదం..

Posted: 09/06/2018 02:06 PM IST
Cm kcr dissolves telangana assembly approves governor

కొత్తగా అవిర్భవించి.. దేశంలోని 29వ రాష్ట్రంగా బాసిల్తుతున్న తెలంగాణలో.. ఉద్యమ పార్టీగా వెలుగొంది.. అనతికాలంలోనే ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకరం చేసుకున్న టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టిన నేపథ్యంలో ఐదేళ్ల పాలనకు బదులు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారన్న లీకులను నిజం చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ తెలుగు రాస్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు తమ అసెంబ్లీ రద్దును సమర్పించారు. దీంతో మరో తొమ్మిది నెలల పాటు పాలనను సాగించాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. అనూహ్యంగా కేవలం నాలుగేళ్ల 3 నెలల 4 రోజుల పాటు మాత్రమే పాలనను సాగించింది.

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులకు ప్రగతి భవన్ రావాలని అదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్.. మధ్యహ్నాం 1.30కు వారిందరితో ప్రగతిభవన్ లోనే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఏకవాఖ్య తీర్మాణం చేయించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ నరసింహన్ కు తమ తీర్మాణం కాఫీని ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన గవర్నర్ ను కోరారు. ఈ క్రమంలో దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. తరువాత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అమోద ముద్ర వేశారు.

కాగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను అపధర్మ ముఖ్యమంత్రిగా కోనసాగాలని గవర్నర్ కోరారు. దీంతో అసెంబ్లీ రద్దయినట్టు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి రాజ్ భవన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో, ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికార నివాసమైన ప్రగతి భవన్ లోనే మీడియా ముందుకు రానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles