Telangana CM KCR announces his candidates in Press Meet అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. క్రాంతికిరణ్ కు టిక్కెట్

Telangana cm kcr announces his candidates in press meet

K. Chandrasekhara Rao, TRS, KCR, kranti kiran, babu mohan, konda surekha, k.laxma reddy, ktr, harish rao, sititing mla, balka suman, chennur, andole, patnam mahender reddy, patnam narender reddy, Telangana cabinet meet, Telangana, Politics

Telangana Chief Minister K. Chandrasekhar Rao announces his party candidates in his first press meet, journalist kranti kiran bags TRS ticket from Andole.

అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. క్రాంతికిరణ్ కు టిక్కెట్

Posted: 09/06/2018 04:16 PM IST
Telangana cm kcr announces his candidates in press meet

తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నానన్న ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీని రద్దు చేసిన తరువాత నిర్వహించిన తొలి మీడియా సమావేశంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ తరపున రానున్న ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించారురు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సినీనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ కు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత.. జర్నలిస్టు నేత క్రాంతి కిరణ్ కు టిక్కెట్ కేటాయించారు.

అందోల్ నియోజకవర్గంలో గతంలో టీడీపీకి.. ప్రస్తుతం టీఆర్ఎస్ మంచి పట్టు వున్నప్పటికీ.. స్థానికుడైన నాయకుడు లేకపోవడంతో.. ఆయా పార్టీలతో గెలుపోటములు దోబుచులాట ఆడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ బరిలో నిలుస్తుండటంతో ఆయనకు పోటాపోటీగా వుండాలంటే టీఆర్ఎస్ నేత స్థానికుడై వుండాలన్న వాంఛ అందోల్ వాసులలో వుంది. ఇన్నాళ్లు అందోల్ వాసుల కల కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో తీరింది.

మొత్తంగా 119 స్థానాలకు గాను 105 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. 14 స్థానాల్లో చర్చ జరగాల్సి ఉన్నందున అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో పెట్టామన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొందర్లోనే ప్రకటిస్తామన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపుగా అందరికీ సీట్లు ఇస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రులు కొండా సురేఖ, దానం నాగేందర్ లకు టిక్కెట్లు పెండింగులో పడ్డాయి. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి టిక్కెట్ ఆశిస్తుండగా, కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు.

గత ఎన్నికలలో ఆమె టిఆర్ఎస్ పక్షాన గెలిచారు. కాగా ఎమ్.పి బల్క సుమన్ ఈసారి చెన్నూరు నుంచి అసెంబ్లీ నుంచి పోటీచేయబోతున్నారు. ఆయనకు టిక్కెట్ ను ఖరారు చేశారు.ఆందోల్ లో జర్నలిస్టు క్రాంతికి టిక్కెట్ ఇచ్చారు.కాగా పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న హుజూర్ నగర్ నుంచి టిఆర్ఎస్ టిక్కెట్ ఖరారు చేయలేదు. వికరాబాద్ లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవరావుకు కూడా షాకిచ్చిన టీఆర్ఎస్..మాజీ మంత్రి చంద్రశేఖర్ ను పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తుందని టాక్. ఇక మేడ్చల్ లో కూడా మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వస్తున్నారన్న వార్తలతోనే ఆ స్థానాన్ని కూడా పెండింగ్ లో పెట్టినట్టు సమాచారం.

టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

భద్రాద్రి కొత్తగూడెం:
1)భద్రాచలం : డా: తెల్లం వెంకట రావ్‌
2) పినాక : పాయమ్‌ వెంకటేశ్వర్లు
3) అశ్వారావు పేట : తాటి వెంకటేశ్వర్లు
4)యల్లెందు : కోరమ్‌ వెంకయ్య
5) కొత్తగూడెం : జలగం వెంకట్‌ రావు

ఖమ్మం :
6) ఖమ్మం​: పువ్వాడ అజయ్‌ కుమార్‌
7) పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌ రావు
8) వైరా : బానోత్‌ మదన్‌ లాల్‌
9)మధిర : లింగాల కమల్‌రాజ్‌
10) సత్తుపల్లి : పిడమర్తి రవి

మహబూబాబాద్‌ :
11) మహబూబాబాద్‌ : బానోత్‌ శంకర్‌ నాయక్‌
12) దోర్నకల్‌ : డీఎస్‌ రెడ్య నాయక్‌

వరంగల్‌ (రూరల్‌) :
13) పరకాల : చల్లా ధర్మా రెడ్డి
14) నర్సంపేట్‌ : పెద్ది సుదర్శన్‌ రెడ్డి
15) వర్థన్నపేట : అరూరి రమేష్‌

వరంగల్‌ ( అర్బన్‌) :
16) వరంగల్‌ వెస్ట్‌ : దాస్యం వినయ్‌ భాస్యర్‌

జయశంకర్‌ భూపాలపల్లి :
17) భూపాలపల్లి : ఎస్‌. మధుసూదనాచారి
18) ములుగు : అజ్మీరా చందులాల్‌

జనగాం :
19) జనగాం : ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
20) స్టేషన్‌ ఘన్‌పూర్‌ : డా. తాటికొండ రాజయ్య
21) పాలకుర్తి : ఎర్రబెల్లి దయాకర్‌ రావ్‌

నల్గొండ :
22) నల్గొండ : కంచర్ల భూపాల్‌ రెడ్డి
23) మిర్యాలగూడ : ఎన్‌. భాస్యర్‌ రావ్‌
24) నాగార్జున సాగర్‌ : నోముల నర్సింమయ్య
25) దేవరకొండ : రమావత్‌ రవీంద్ర కుమార్‌
26) మునుగోడు : కుసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి
27)నక్రేకల్‌ : వేముల వీరేశం

సూర్యాపేట్‌ :
28) సూర్యాపేట్‌ : గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి
29) తుంగతుర్తి : గ్యాదారి కిషోర్‌ కుమార్‌
యాదాద్రి భువనగిరి :
30) ఆలేరు :  గొంగిడి సునీత
31) భువనగిరి : పైల్ల శేఖర్‌ రెడ్డి

నిజామాబాద్‌ :
32) నిజామాబాద్‌ అర్బన్‌ : గణేష్‌ బీగాల
33) నిజామాబాద్‌ రూరల్‌ : బాజిరెడ్డి గోవర్థన్‌
34) ఆర్మూర్‌ : ఆశాన్నగరి జీవన్‌ రెడ్డి
35) బాల్కొండ : వేముల ప్రశాంత్‌ రెడ్డి
36) బోదన్‌ : షకీల్‌ అహ్మద్‌

కామారెడ్డి :
37) బాన్స్‌వాడా : పోచారం శ్రీనివాస రెడ్డి
38) కామారెడ్డి : గంప గోవర్థన్‌
39) జుక్కల్‌ : హనుమంతు షిండే
40) యాల్లారెడ్డి : ఏనుగు రవీందర్‌ రెడ్డి

అదిలాబాద్‌ :
41) అదిలాబాద్‌ : జోగు రామన్న
42) బోధ్‌ : రాథోడ్‌ బాబు రావ్‌
43)ఖానాపూర్‌ : రేఖా నాయక్‌

అసిఫాబాద్‌ :
44) అసిఫాబాద్‌ : కోవ లక్ష్మీ
45) సిర్పూర్‌ కాజా నగర్‌ : కోనేరు కోనప్ప

నిర్మల్‌ :
46) నిర్మల్‌ : అల్లోల ఇంద్ర కరణ్‌ రెడ్డి
47) ముధోల్‌ : జి. విట్టల్‌ రెడ్డి

మంచిర్యాల :
48) మంచిర్యాల : నాదిపెల్లి దివాకర్‌ రావ్‌
49) బెల్లంపల్లి : దుర్గం చిన్నయ్య
50 ) చెన్నూర్‌ : బాల్క సుమన్‌

కరీంనగర్‌ :
51) కరీంనగర్‌ : గంగుల కమలాకర్‌
52) హుజూరాబాద్‌ : ఈటెల రాజేందర్‌
53) మనకొండూర్‌ : రసమయి బాలక్రిష్ణ

సిరిసిల్ల :
54) సిరిసిల్ల : కేటీ రామారావ్‌
55) వేములవాడ : చెన్నమనేని రమేష్‌

జగిత్యాల :
56) జగిత్యాల : డా. ఎమ్‌. సంజయ్‌ కుమార్‌
57) కోరుట్ల : కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావ్‌
58) ధర్మపురి : కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి :
59) పెద్దపల్లి : దాసరి మనోహర్‌ రెడ్డి
60) మంతని :  పుట్ట మధుకర్‌
61) రామగుండమ్‌ : సోమారపు సత్యనారాయణ

సిద్దిపేట :
62) సిద్దిపేట : హరీశ్‌రావు
63) దుబ్బాక : సోలిపేట రామాలింగారెడ్డి
64) గజ్వేల్ : కేసీఆర్
65) హుస్నాబాద్ : సతీష్‌కుమార్

మెదక్‌ :
66) మెదక్‌ : పద్మాదేవేందర్‌ రెడ్డి
67) నార్సాపూర్‌ : చిలుముల మదన్‌ రెడ్డి

సంగారెడ్డి :
68) సంగారెడ్డి : చింతా ప్రభాకర్
69) నారాయణఖేడ్ : భూపాల్‌‌రెడ్డి
70) ఆందోల్ : చంటి క్రాంతి కిరణ్
71) పటాన్‌చెరు : గూడెం మహిపాల్ రెడ్డి

మహమూబ్‌నగర్‌ :
72) మహబూబ్‌నగర్ : శ్రీనివాస్‌గౌడ్
73) జడ్చెర్ల : లక్ష్మారెడ్డి
74) దేవరకద్ర : ఆలే వెంకటేశ్వర్‌రెడ్డి
75) నారాయణపేట్ : రాజేందర్‌రెడ్డి
76) మక్తల్‌ : చిట్టం రామ్‌ మోహన్‌ రెడ్డి

నాగర్‌కర్నూల్‌ :  
77) నాగర్‌‌కర్నూల్ : మర్రి జనార్ధన్‌రెడ్డి
78) కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు
79) అచ్చంపేట : గువ్వల బాలరాజ్
80) కల్వకుర్తి : జి. జైపాల్‌ యాదవ్‌

వనపర్తి :
81) వనపర్తి : సింగి రెడ్డి నిరంజన్‌ రెడ్డి

గద్వాల్‌ :
82) గద్వాల్‌ : బండ్ల క్రిష్ణ మోహన్‌ రెడ్డి
83) ఆలమూర్‌ : వల్లూర్‌ మల్లెపోగు అబ్రహం

వికారాబాద్‌ :
84) పరిగి : కోప్పుల మహేష్‌ రెడ్డి
85) తాండూర్‌ : పట్నం మహేందర్‌ రెడ్డి
86) కొడంగల్‌ : పట్నం నరేందర్‌ రెడ్డి

రంగారెడ్డి :
87) షాద్‌నగర్‌ : అంజయ్య యాదవ్
88) రాజేంద్రనగర్‌ : ప్రకాష్‌ గౌడ్‌
89) మహేశ్వరం : తీగల కృష్ణారెడ్డి
90) ఇబ్రహింపట్నం : మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
91)శేరిలింగంపల్లి: అరికెపూడి గాంధీ
92) ఎల్బీనగర్‌ : మద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌
93) చేవెళ్ల : కాలె యాదయ్య

మల్కాజ్‌గిరి :
94) కుత్బుల్లాపూర్‌:  వివేకానంద
95) కూకట్‌పల్లి :  మాధవరం కృష్ణారావు
96) ఉప్పల్‌ : సుభాష్‌ రెడ్డి

హైదరాబాద్‌ :
97) సికింద్రాబాద్‌ : పద్మారావు
98) సనత్‌ నగర్‌ :  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
99) కంటోన్మెంట్‌ : సాయన్న
100) జూబ్లీహిల్స్‌ :  మాగంటి గోపినాథ్‌
101) యాకత్‌పూరా:  సామ సుందర్‌ రెడ్డి
102) చాంద్రాయణగుట్ట : ఎం. సీతారాం రెడ్డి
103) కార్వాన్‌ : జీవన్‌ సింగ్‌
104) బహదూర్‌పురా :  ఇయాకత్‌ అలీ
105) నాంపల్లి : మునుకుంట్ల ఆనంద్‌ గౌడ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K. Chandrasekhara Rao  TRS  KCR  kranti kiran  babu mohan  konda surekha  andole  Telangana  Politics  

Other Articles