Karunanidhi is a tough person, says Rahul కరుణకు రాహుల్ పరామర్శ.. ఆయన చాలా గట్టివారని వ్యాఖ్య

Karunanidhi is a tough person says rahul after meeting dmk chief

Congress, Rahul Gandhi, Sonia Gandhi, Chennai, M. Karunanidhi, Dravida Munnetra Kazhagam, MK Stalin, Venkaiah Naidu, Kanimozhi, Kauvery hospital, PM Modi, politics

Congress President Rahul Gandhi met ailing DMK chief M. Karunanidhi at the Kauvery hospital in Chennai. "I wanted to come and see M Karunanidhi Ji. He is a tough person, I met him and he is stable. Sonia ji has sent her best wishes and regards to the family," Gandhi told the media.

కరుణకు రాహుల్ పరామర్శ.. ఆయన చాలా గట్టివారని వ్యాఖ్య

Posted: 07/31/2018 05:57 PM IST
Karunanidhi is a tough person says rahul after meeting dmk chief

చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఇవాళ అనేక మంది ప్రముఖులు పరామర్శించారు. అసుపత్రికి చేరుకున్న ప్రముఖులు కరుణానిధిని కలిసేందుకు వీలు లేకపోవడంతో అక్కడే వున్న ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్, కూతరు కనిమొళిలతో ఆయన ఆరోగ్యం విషయమై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వీరిలో శ్రీలంక అధ్యక్షుడి మైత్రిపాల సిరిసేన పంపిన ప్రతినిధులతో పాటు మలేషియన్ ఇండియన్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా కరుణానిధిని పరామర్శించారు.  

ఆ తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయ కురువృద్దనేత కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి చాలా గట్టిమనిషని రాహుల్ అన్నారు. కరుణ కోలుకుంటున్నాడని తెలిపారు. కరుణ కుంటుబానికి సోనియాగాంధీ బెస్ట్ విషెస్ తెలిపారని రాహుల్ అన్నారు. ఇప్పటికే అనేక మంది సీనీ ప్రముఖులు, తమిళ సీఎం పళనిస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్, పలువురు రాజకీయ నాయకులు కరుణానిధి అరోగ్యంపై వాకాబు చేశారు.

ఇటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, శ్రీలంక మంత్రులు కూడా కరుణానిధిని పరామిర్శించారు. మరోవైపు కరుణ ఆరోగ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కావేరీ హాస్పిటల్ దగ్గరకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కరుణ అభిమానులు చేరుకున్నారు. కరుణ కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Rahul Gandhi  Karunanidhi  DMK  Stalin  Venkaiah Naidu  Kauvery hospital  PM Modi  politics  

Other Articles