green signal for visakha railway zone విశాఖ రైల్వే జోను ఇచ్చేందుకు మేం సిద్దం: నితిన్ గడ్కారీ

We are ready to give special railway zone nitin gadkari

Nitin Gadkari, Visakha railway zone, green signal, Haribabu, BJP Parliamentary meet, PM Modi, BJP, TDP, Chandrababu, Andhra pradesh, politics

Union Minister Nitin Gadkari on Tuesday responded on Visakha railway zone issue and express that centre is ready to give a special zone.

విశాఖ రైల్వే జోను ఇచ్చేందుకు మేం సిద్దం: నితిన్ గడ్కారీ

Posted: 07/31/2018 07:04 PM IST
We are ready to give special railway zone nitin gadkari

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని ఓ వైపు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటరీ సమావేశాల్లో కూడా నిలదీస్తున్న ఏపీ ఎంపీలకు కాసింత ఊరటనిచ్చే వార్తను కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తమ పార్టీ పార్లమెంటరీ బేటీలో వెల్లడించారు. పత్యేక హోదా తప్ప రాష్ట్రానికి కావాల్సిన అన్ని నిధులను కేటాయిస్తున్నామని చెప్పిన ఆయన విశాఖ జిల్లా ప్రజలు రాష్ట్ర విభజనకు ముందునుంచి కోరుకుంటున్న అంశంలో మాత్రం సానుకూలంగా స్పందించారు. ఇన్నాళ్లు రాష్ట్రపునర్విభజన బిల్లులో వున్నవాటిని పరిశీలిస్తున్నామని చెబుతూ వచ్చిన కేంద్రమంత్రి.. సరిగ్గా ఎన్నికలకు వెళ్లే ఏడాది కావడంతో పచ్చజెండా ఉపూతూ తీపికబురును చెప్పారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించిన ఆయన.. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని శుభవార్తను అందించారు. నాలుగేళ్లుగా కమిటీలు వేశాం వాటి నివేదికలు అందిన తరువాతే పరిశీలిస్తామని ఇటీవల కూడా చెప్పిన నితిన్ గడ్కారీ.. ఎన్నికలకు వేళాయరా అంటూ ఇప్పుడే రాష్ట్రంలో హాట్ గా కొనసాగుతున్న రాజకీయాల నేపథ్యంలో తాము బరిలో వున్నామని చాటుకునేందుకు వెంటవెంటనే చర్యలు తీసుకుని.. ఇక విశాఖ రైల్వే జోనుకు తాము సిద్దమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ప్రత్యేక హోదాను, పేరును కల్పించలేకపోయినా దానికి సమానస్థాయిలో అన్ని రకాలుగా ఆదుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి తమ ప్రభుత్వం పాటుపడుతుందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. హోదా ఇచ్చిన నేపథ్యంలో లభించే అన్ని సదుపాయాలను, వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. డిల్లీలో జరిగిన బీజేపి పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిన ప్రధానికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన ఆయన అంధ్రప్రదేశ్ ను అదుకునేందుకు తమ ప్రభుత్వం ఎంతో పాటుపడిందన్నారు.

ఈ సమావేశం వేదికగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశాలను గడ్కరీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరుగుతోందని విమర్శించారు. విపక్ష పార్టీలన్నీ కలసి కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. హోదా పేరుతో ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం వల్ల దేశంలో చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు వివరించే అవకాశం లభించిందన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం పెట్టే వాతావరణ లేకపోయినా ప్రతిపక్షాలు తీసుకొచ్చాయని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles