quick prosecution in cheque bounce ఇకపై చెక్ బౌన్స్ అయితే పంబరేగినట్టే..

Citizens welcome law to check cheque bounce cases

cheque bounce, Negotiable Instruments Act, Mantosh Kumar Gupta, Chartered Accountant, cheque-bounce offense, interim compensation, Parliament, cheque, banking

A bill allowing the court to try offenses related to cheque bounce and directing the drawee to pay a minimum of 20 per cent of the amount as interim compensation was passed by the Parliament.

చెక్ బౌన్స్ అంశంలో సవరణను స్వాగతిస్తున్న దేశప్రజలు

Posted: 07/31/2018 11:44 AM IST
Citizens welcome law to check cheque bounce cases

దేశవ్యాప్తంగా చెక్ బౌన్సు కేసులు రోజురోజుకూ శిఖరాల ఎత్తుకు పెరుగుతూ ఉండటంతో పార్లమెంటు తాజాగా తీసుకువచ్చిన సవరణలను దేశప్రజలు, మరీ ముఖ్యంగా నగరవాసులు స్వాగతిస్తున్నారు. దీంతో చెక్ బౌన్స్ కేసులకు పాల్పడే మోసగాళ్లకు కనీసం రెండు మాసాల్లో కొంత డబ్బును చెల్లించాల్సి రావడం.. ఆ తరువాత కేసుల విచారణ కూడా వేగవంతంగా జరగనుందన్న వార్తలు వారికి సంతోషాన్ని ఇస్తున్నాయి.

ఈ మేరకు పార్లమెంటులో నెగోషిబుల్ ఇన్ స్ట్రుమెంటల్ యాక్ట్ - 1881కు కీలక సవరణలు చేయగా, ఈ బిల్లును అటు లోక్ సభ, ఇటు రాజ్యసభ ఆమోదించాయి. త్వరలోనే చట్ట రూపం దాల్చనున్న బిల్లు వల్ల చెక్ బౌన్స్ కేసుల విచారణ వేగవంతం అవుతుందని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. చెక్ బౌన్సు అయినట్టు కేసు వేస్తే, ప్రస్తుతం దాని పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందన్న సంగతి తెలిసిందే.

మారనున్న చట్టం ప్రకారం, చెక్ బౌన్స్ కేసు దాఖలు కాగానే, చెక్కు ఇచ్చిన వ్యక్తి, లేదా సంస్థ 20 శాతం మొత్తాన్ని బాధితుడికి చెల్లించాల్సివుంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు 60 రోజుల సమయం ఇస్తారు. కేసు పూర్తయ్యేలోగా కనీసం కొంతైనా బాధితుడికి అందాలన్న ఉద్దేశంతో ఈ మార్పును ప్రతిపాదించారు. ఇక కింద కోర్టు తీర్పును చెక్ ఇచ్చిన వ్యక్తి పై కోర్టులో సవాల్ చేయాలని భావిస్తే, మరో 20 శాతం మొత్తాన్ని బాధితుడికి చెల్లించాలి. ఇక చెక్ బౌన్స్ కేసును న్యాయమూర్తి కొట్టేసిన పక్షంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheque bounce  Negotiable Instruments Act  interim compensation  Parliament  cheque  banking  

Other Articles