never troll jagan family members: pawan kalyan వ్యక్తిగత దూషణలు వద్దు.. ఆడపడచులను లాగొద్దు: పవన్ కల్యాన్

No personal attack on jagan and his family members appeals pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan west godavari, bhimavaram, bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan appeal, pawan kalyan west godavari yatra, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan appeals to fans, never troll personally on jagan and his family members.

వ్యక్తిగత దూషణలు వద్దు.. ఆడపడచులను లాగొద్దు: పవన్ కల్యాన్

Posted: 07/26/2018 01:37 PM IST
No personal attack on jagan and his family members appeals pawan kalyan

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన నేపథ్యంలో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు జగన్ సహా ఆయన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో మూకుమ్మడి దాడి కోనసాగిస్తున్నారు. జగన్ కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తున్న అభిమానులు ట్రాల్ చేయడం తన దృష్టికి రావడంతో వాటిపై పవన్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ ఏ రాజకీయ నేతలనైనా, వారి కుటుంబసభ్యులనైనా వ్యక్తిగత దూషణలను చేయడం మన పార్టీ సంస్కృతి కాదని అభిమానులకు విన్నవిస్తూ ఒక పోస్టు పెట్టారు.

జగన్ చేసిన వ్యక్తిగత దూషణల నేపథ్యంలో ఆయనను కానీ, ఆయన ఇంటి ఆడపడుచులను, కుటుంబ సభ్యులను అనవసరంగా వివాదాల్లోకి లాగవద్దని విన్నవించారు. ఆయన పెట్టిన పోస్టు సారాంశం ఇలా వుంది..  "ఈ మధ్యన జగన్ మోహన్ రెడ్డి నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను. అది రాజకీయ లబ్ది కోసం అసలు వాడను. ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను కానీ, నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు. ఈ తరుణంలో ఎవరన్నా జగన్ మోహన్ రెడ్డిని కానీ, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. ఈ వివాదాన్ని దయచేసి అందరూ ఇక్కడితో ఆపివేయాల్సిందిగా నా ప్రార్థన" అని పోస్టు పెట్టారు.

అయితే అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. ఫాక్ష్యనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఉప్పెనలా దాడి చేస్తామని, అలాంటి పోరాటమే కావాలనుకుంటే సిద్ధమని కూడా వైఎస్సార్ సీపీ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. విలువలతో కూడిన రాజకీయం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడినని అన్నారు. తాను వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలుపెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు తట్టుకోలేరని, పారిపోతారని మండిపడ్డారు. ఇసుక మాఫియా, కుంభకోణాలు, దోపిడీలు చేసే వీళ్లకు తనను విమర్శించేదుకు ఏ అవకాశం లేక ఇలా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

రాజకీయాల్లో మానవత్వం చచ్చిపోయిందని, మరిచిపోయిన మానవత్వాన్ని, జవాబుదారీతనాన్ని, పారదర్శకతను రాజకీయాల్లో మళ్లీ తీసుకురావడానికే జనసేన పార్టీ పెట్టానని అన్నారు. ‘రాజకీయాలకు వేల కోట్లు, గూండాలు అవసరం లేదు. ఆశయం కోసం తెగించే గుణం ఉంటే చాలు. ‘జనసేన’ అటువంటి ఆశయంతో ప్రజా శ్రేయస్సుకు పోరాటం చేస్తుంది... సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తానే ఈ స్థాయికి వస్తే, బాగా చదువుకున్న మీరు ఏ స్థాయికి వెళ్లగలరో ఊహించుకోవాలి. ఒక తరంలో మార్పు రావాలంటే 25 ఏళ్లు పడుతుంది. అందుకే, తాను ఇరవై ఐదేళ్లు రాజకీయాలు చేయడానికి వచ్చానని తరచూ చెబుతున్నా. ఐదేళ్లు గట్టిగా కష్టబడితే ముఖ్యమంత్రి సీటులో కూర్చోవచ్చు కానీ, దానివల్ల సమాజంలో ఏ మార్పు రాదు. ఒక సామాజిక మార్పు తెచ్చేందుకు మరింత ప్రణాళికతో ముందుకు వెళ్లాలి’ అని పవన్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  west godavari  bhimavaram  fans  ys jagan  porata yatra  andhra pradesh  politics  

Other Articles