16-yr-old girl with HIV asks strangers for hugs నన్ను హగ్ చేసుకోరూ.. 16 ఏళ్ల అమ్మాయి పిలుపు..

Uzbekistan teen with hiv asks strangers for hugs

hiv, hiv and aids, hiv awareness, teen with hiv asks for hugs, unicef, uzbekistan teenager

A 16-year-old stood on the streets of Uzbekistan with a simple request written on a placard - 'I am HIV positive. Hug me!'

ITEMVIDEOS: నన్ను హగ్ చేసుకోరూ.. 16 ఏళ్ల అమ్మాయి పిలుపు..

Posted: 07/26/2018 01:59 PM IST
Uzbekistan teen with hiv asks strangers for hugs

అది రోడ్డు కూడలి. దాని పక్కనే ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక.. ఒక ప్లకార్డు పట్టకుని నిల్చుంది. తన వద్దనున్న ప్లకార్డులో తనను హగ్ చేసుకోవాలని కోరింది. రోడ్డుపైన.. ఓ బాలిక అలా నన్ను కౌగలించుకోరూ అంటూ ప్లకార్డు పట్టుకోని నిల్చోవడమేంటి అంటూ అలోచనలో పడ్డారా.? అయితే ఆ బాలిక చేస్తున్న పనికి స్థానికుల నుంచి మంచి ఆదరణ లభించింది. అమెను ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలో కౌగలించుకున్నారు. ఆ బాలికను హగ్ చేసుకున్నవారిలో చిన్నారుల నుంచి ముసలిముతక వరకు అందరూ వున్నారు.

అసలీ కాన్సెప్ట్ ఏమిటీ అంటే.. ప్రాణాంతక మహమ్మారి ఎయిడ్స్ పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ పదహారేళ్ల యువతి నడుంబిగించింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను సమాజం దూరంగా పెట్టడాన్ని అమె తప్పబట్టింది. ఈ మహామ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న శైలిలో ప్రచారం చేపట్టింది. అదే ఈ కౌగలింత ప్రచారం. అందుకు సంబంధించిన వీడియోను అంతర్జాతీయ బాలబాలికల పరిరక్షణ సంస్థ యూనిసెప్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది.

ఉజ్బెకిస్తాన్ కు చెందిన అజిమా అనే 16 ఏళ్ల బాలిక తాష్కెంట్ వీధుల్లో "నేను హెచ్ఐవీ పాజిటివ్. కౌగిలించుకోండి" అని రాసున్న ప్లకార్డు ప్రదర్శిస్తూ నిలబడింది. మరో ప్లకార్డులో 10 ఏళ్ల నుంచి హెచ్ఐవీ ఉన్నా, తనకేమీ కాలేదని, తన జీవితాన్ని చక్కగా గడుపుతున్నానని చెప్పింది. ఎవరైనా కౌగిలించుకుంటే, తన కుటుంబ సభ్యులే కౌగిలించుకున్నట్టు భావిస్తానని చెప్పింది. ఇక ఈ ప్లకార్డులు చూసిన పలువురు స్పందించి, ఆమెను అక్కున చేర్చుకున్నారు. అజిమాకు ధైర్యం చెప్పారు.

ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, వ్యాధి ఉన్నవారితో భోజనం పంచుకున్నా, వారిని తాకినా వ్యాధి సోకదని అవగాహన కల్పించేందుకు యునిసెఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని అజిమా చెప్పింది. కాగా తనను కౌగలించుకున్న ప్రతీ ఒక్కరిలో తన తల్లిని, తన అమ్మమ్మను, నాయినమ్మ, తాతయ్యలతో పాటు అన్నదమ్ములను, అక్కచెల్లెల్లను కౌగలించుకున్నట్లు వుందని అజీమా తెలిపింది. ఈ వీడియో చూస్తే తప్పకుండా మీ హృదయం కూడా ద్రవిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hiv  hiv and aids  hiv awareness  teen with hiv asks for hugs  unicef  uzbekistan teenager  

Other Articles