HC grants protection to Chidambaram till Aug 1 చిదంబరానికి ఊరట.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్

Hc grants interim protection to chidambaram in inx media case

chidambaram, karthi chidambaram, INX Media, cbi, delhi high court, supreme court, interim protection, Global Communication Holding Services Ltd, USA, France, UK

The Delhi High Court granted interim protection from arrests to former finance minister P. Chidambaram till August 1, in connection with the INX Media case.

చిదంబరానికి ఊరట.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్

Posted: 07/25/2018 07:27 PM IST
Hc grants interim protection to chidambaram in inx media case

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు ఎదుర్కోంటున్న కేసులో మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి స్వల్ప ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ అర్ధిక శాఖ మంత్రి పేరును కూడా చేర్చిన సీబిఐ, ఈడీ ఆయను ఇప్పటికే పలుమార్లు విచారించింది. కాగా, ఈ కేసులో ఆయనను అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈడీ అరెస్ట్‌ చేయకుండా ఆగస్టు 1 వరకూ మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన తదుపరి విచార‌ణ కూడా అదే రోజుకు వాయిదా వేసింది. ఎఫ్ఐపీబీ నుంచి చిదంబ‌రం త‌న‌యుడి సంస్థ‌ల‌కు ఎలా అనుమ‌తులు వ‌చ్చాయో అనే దానిపై ద‌ర్యాప్తు సంస్థ‌లు ఈడీ, సీబీఐ విచార‌ణ సాగిస్తున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టుబడులు సులువుగా విదేశీ మార్గంలో వ‌చ్చేందుకు కార్తీ చిదంబ‌రం స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ‌, ఇందుకు ఆయ‌న డ‌బ్బులు తీసుకున్నార‌నే దానికి సంబంధించి సీబీఐ ఫిబ్ర‌వ‌రి 28న ఆయ‌న్ను అరెస్ట్ చేసింది. ఇది యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో చిదంబ‌రం ఆర్థిక మంత్రి ప‌ద‌వి నిర్వ‌హిస్తున్న‌ప్పుడు జ‌రిగింది.

ఈ కేసులో ఈడీ కార్తీ చిదంబ‌రాన్ని అరెస్ట్ చేసిన‌ప్ప‌టికీ త‌ర్వాత బెయిల్ ల‌భించింది. అయితే.. మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కార్తీ కేసు యధావిధంగా కోనసాగుతుందని కూడా న్యాయస్థానం తెలిపింది. ఇదిలావుండగా, కార్తి చిదంబరానికి ఈ నెల 31 వరకు తన వ్యాపార వ్యవహారాల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనకు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు ఆయన అమెరికా, ఫ్రాన్స్, యూకే వెళ్లేందుకు అనుమతి కావాలని పిటీషన్ దాఖలు చేయగా, అందుకు అనుమతి మంజూరు చేసింది అత్యున్నత న్యాయస్థానం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chidambaram  INX Media  karthi chidambaram  cbi  delhi high court  supreme court  interim protection  

Other Articles