CCTV footage: Chaddi gang hulchul In Nizampet నగర శివార్లలో చెడ్డీగ్యాంగ్.. భయాందోళనలో స్థానికులు..

Cctv footage chaddi gang hulchul in nizampet

Chaddi gang hulchul In Nizampet, Chaddi gang, Chaddi gang robbers, Chaddi gang in bandari layout, Chaddi gang in nizampet, Chaddi gang in hyderabad, Chaddi gang in telangana, thieves, cctv cameras, bandari layout, nizampet, hyderabad, cyberabad police, telangana, crime

Chaddi gang robbers were caught in CCTV cameras, while they attempted to break into houses in an apartment, at Bandari layout in Nizampet of Hyderabad.

ITEMVIDEOS: నగర శివార్లలో చెడ్డీగ్యాంగ్.. భయాందోళనలో స్థానికులు..

Posted: 06/11/2018 02:02 PM IST
Cctv footage chaddi gang hulchul in nizampet

వాట్సాప్ సహా సామాజిక మాద్యమాల్లో దొంగలపై జరుగుతున్న ప్రచారం, పిల్లలను ఎత్తుకెళ్తున్నారన్న ప్రచారాన్ని ఖండిస్తూ.. పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకున్న దొంగలు బరితెగిస్తున్నారు. యదేశ్చగా దొంగలకు పాల్పడుతున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులకు సవాల్ విసిరుతూ చెలరేగిపోయిన చెడ్డీగ్యాంగ్ దొంగలు.. గత కొంతకాలంగా చలీచప్పుడు లేకుండా వున్నారు. అయితే వారు మళ్లీ హల్ చల్ చేస్తున్నారని తాజా వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్ నగర శివార్లలో వున్న నిజాంపేట్ గ్రామపరిధిలోని బండారి లే-అవుట్ లో గల ఓ అపార్టుమెంటులో చెడ్డీగ్యాంగ్ దొంగలు హల్ చల్ చేశారు. అర్థరాత్రి వేళ ఆపార్టుమెంటులోని ఓ ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసేందుకు నిశ్చయించుకున్న ఇద్దరు దొంగల యత్నాలను సీసీటీవీలు నిక్షిప్తం చేశాయి. సెల్లార్ నుంచి పై అంతస్థులకు వెళ్లేందుకు వారు యత్నించారు. అయితే ఇద్దరు దొంగల్లో ఒకరు సిసీటీవీలను గమనించి మరో దొంగకు దాని గురించి సమాచారం అందించాడు.

దీంతో నీలం చెడ్డీ వేసుకున్న దొంగ వెనక్కు వెళ్తూ.. మళ్లీ ఏమనుకున్నాడో ఏమో తిరిగి సెల్లార్ లోని మెట్లపైకి వెళ్లేందుకే మొగ్గుచూపాడు. అయితే అతడి వెంటే వెళ్లిన మరో దొంగ అతన్ని వారించాడో ఏమో తెలియదు కానీ, దొంగలు మాత్రం సదరు అపార్టుమెంటులో ఏ ఇంటికీ కన్నం వేయలేదు. అయితే ఈ వీడియోలను గమనించిన అపార్టుమెంటు వాసులు విస్మయానికి గురై.. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా, చెడ్డీ గ్యాంగ్ దొంగలు తమ కాలనీల్లో సంచరిస్తున్నారన్న విషయం తెలిసిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chaddi gang  thieves  cctv cameras  bandari layout  nizampet  hyderabad  telangana  crime  

Other Articles