IAS officer accuses superior of sexual molestation సీనియర్ చేతిలో ఐఏఎస్ అధికారికి లైంగిక వేధింపులు

Woman ias officer in haryana accuses superior of sexual molestation

Haryana, IAS officer, sexual harassment, woman IAS officer, senior IAS officer, facebook, chief secretary DS Desai, chattisgarh, domestic help, senior IAS officer, India, molestation case, Police, bail bond, haryana, crime

A 28-year-old IAS officer posted in Haryana Government has made sensational allegations of sexual harassment on her senior officer. Repeated phone calls and text messages to state chief secretary DS Dhesi failed to elicit a response till the time of going to print.

జూనియర్ పై సీనియర్ ఐఏఎస్ అధికారి లైంగిక వేధింపులు..

Posted: 06/11/2018 11:22 AM IST
Woman ias officer in haryana accuses superior of sexual molestation

ఐదు రోజుల క్రితం ఓ ఐఎఎస్ అధికారి తన ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న యువతిపై నాలుగు నెలల క్రితం లైంగిక దాడి చేసిన కేసులో అరెస్టు అయిన ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయిఘడ్ లో వెలుగుచూసిన విషయాన్ని దేశంలోని ఐఎఎస్ అధికారులు ముక్తకంఠంతో ఖండిస్తున్న క్రమంలోనే మరో ఐఎఎస్ అధికారి కూడా అలాంటి ఘటనలకే పాల్పడి.. తాను ఉన్నత హోదాలో వున్నా తన బుద్ది మాత్రం అత్యంత చిన్నదని నిరూపించుకున్నాడు. అయితే తాను లైంగిక వేధింపులకు పాల్పడింది కూడా తన జూనియర్ ఐఏఎస్ అధికారిపైనే కావడం.. చర్చనీయంశంగా మారింది.

సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తనను లైంగికంగా వేధించారంటూ మహిళా ఐఏఎస్ అధికారి ఒకరు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. అయితే తనపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ఈ విషయాన్ని రాష్ట్ర ఛీప్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయనకు పలుమార్లు ఫోన్ చేశానని, పదే పదే టెక్ట్స్ మెసేజ్ లు కూడా పంపానని, అయితే తాను ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని పోస్టు చేసేంత వరకు తనకు ఆయన వద్ద నుంచి కూడా ఎలాంటి సమాధానం కూడా రాలేదని అమె అవేదన వ్యక్తం చేశారు.

ఇక ఇరవై ఎనమిదేళ్ల మహిళా అధికారిని తాను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన దాని ప్రకారం..  గత నెల 22న సదరు అధికారి తనను ఆయన కార్యాలయానికి పిలిపించుకుని బెదిరించారని తెలిపారు. ఆయా విభాగాలు చేసిన తప్పుల గురించి ఫైల్స్ ఎందుకు సిద్ధం చేస్తున్నారని ప్రశ్నించారని, వాటిని ఆపకపోతే వ్యతిరేకంగా వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 31న మరోమారు తన గదికి పిలిచి వేధించారని, గదిలోకి ఎవరినీ  పంపవద్దని సిబ్బందికి సూచించారని పేర్కొన్నారు. మరో సందర్భంలో కొత్త పెళ్లి కూతురులా అన్నీ వివరించాల్సి వస్తోందని అన్నారని తెలిపారు. ఈనెల 6వ తేదీన సాయంత్రం మళ్లీ తన గదికి పిలిచి రాత్రి వరకు ఉండమన్నారని, తనకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించారని ఆ పోస్టులో వివరించారు.

అయితే, తనపై మహిళా ఐఏఎస్ అధికారి చేసిన ఆరోపణలను సీనియర్ అధికారి కొట్టిపడేశారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పారు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఆమె తన కార్యాలయంలో ఒంటరిగా ఎప్పుడూ లేరన్నారు. ఆమెతో పాటు ఒకరిద్దరు ఉండేలా చూసుకున్నానన్నారు. అధికారులు అప్పటికే క్లియర్ చేసిన ఫైళ్లలో తప్పులు వెతకడాన్ని మాత్రమే తాను తప్పుపట్టినట్టు చెప్పారు. ఆమె యువ అధికారిణి కావడంతో ఆమెకు పని నేర్పాలని మాత్రమే అనుకున్నానని వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : senior IAS officer  sexual harassment  woman IAS officer  facebook  cs DS Desai  haryana  crime  

Other Articles