Tyres of Indian economy are punctured: P Chidambaram అరచేతిలో వైకుంఠం.. అచరణలో మాత్రం శూన్యం

Chidambaram slams government on fuel prices and joblessness

chidambaram, indian economy, chidambaram on indian economy, chidambaram on demonetisation, chidambaram on gst, chidambaram on petrol prices, chidambaram on inflation, chidambaram on joblessness, chidambaram on nda government, chidambaram on bjp, chidambaram on modi sarkar, rise in petrol price, farmer protest

Former finance minister P Chidambaram said that state of the economy was bad in the country due to the wrong policies of the NDA government and tyres of three of the four wheels on which the economy rides were punctured.

గాడితప్పిన మోడీ పాలన.. అర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం: చిదంబరం

Posted: 06/11/2018 04:14 PM IST
Chidambaram slams government on fuel prices and joblessness

నిత్యావసర సరుకుల ధరలు పైపైకి ఎగబాకడం, ఇంధర ధరలకు రెక్కలు రావడం, నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతూ పోవడం, నోట్ల రద్దు, రైతులకు గిట్టుబాటు ధర లభ్యంకాకపోవడం, భారతీయ అర్థికాభివృద్ది కుంటుపడటంపై కేంద్రమాజీ మంత్రి పి.చిదంబరం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా వ్యాపారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ రెండు భారత అర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమయ్యాయని ఆయన మండిపడ్డారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే కేంద్రం ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ ధరల తగ్గింపును రాష్ట్రాల మీదకు నెట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్రాలు తమ వ్యాట్ చార్జీలను తగ్గించుకోవాలని చెప్పడం.. దానిని రాష్ట్రాల సమస్యగా మార్చివేయడానికేనని ఆయన ఫైర్ అయ్యారు. పెట్రోల్‌, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తప్పకుండా ధరలు తగ్గుతాయన్నారు. కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉందన్న చిదంబరం …అలాంటపుడు పెట్రోల్‌ ధరల పెరుగుదలపై రాష్ట్రాలను ఎందుకు నిందిస్తున్నారన్నారు. వాళ్లకు అధిక రాష్ట్రాల్లో మెజారిటీ ఉంది కాబట్టి ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక రైతులు తమ పంటకు సరైన గిట్టుబాటు ధర అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. గిట్టుబాటు ధరలతో పాటు పంటపెట్టుబడిలో 50 శాతం అదనంగా ఇప్పిస్తానన్న ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు, ఏడాదికి యాభై లక్షల ఉద్యోగాల కల్పిన కూడా ఎన్టీఏ హయాంలో అందని ద్రాక్షాగానే మిగిలిందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని.. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన మోడీ.. దేశంలోని ఏ ఒక్కవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఎవరినీ తృప్తిపర్చలేదని విమర్శలు గుప్పించారు.

ప్రైవేటు పెట్టబడులు తగ్గిపోవడంతో …గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకడం లేదని యువతకు అర్థమైందని… అందుకే వాళ్లు పకోడి అమ్ముకునే పనిని కూడా ఉద్యోగమనే అనుకుంటున్నారన్నారు చిదంబరం. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక అర్బీఐ మే మాసంలో చేసిన కన్జూమర్ కాన్ఫిడెన్స్ సర్వేలో.. గత ఏడాదిగా 48 శాతం మంది దేశప్రజలు భారత అర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న అభిప్రాయాన్ని వెలువరించారని ఆయన తెలిపారు. ఈ సర్వే దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో లేక నగరాల్లోని దారిద్ర రేఖకు దిగువనున్న వారి అభిప్రాయాలను జోడించలేదని.. వారి అభిప్రాయాలను కూడా జోడించివుంటే.. 48 శాతం కాస్తా గణనీయంగా పెరిగివుండేదని చిదరంబరం అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : P Chidambaram  economy  india  NDA  GST  demonetisation  inflation  joblessness  

Other Articles