After fuel, now LPG cylinders to be costlier పైసల్లో తగ్గిన ఇం‘ధనం’.. పెరిగిన గ్యాస్ సిలిం‘డర్’ ధర..

After fuel now lpg cylinders to be costlier

LPG cylinders, subsidy lpg cylingder, non-subsidy lpg cylingder, Petrol-diesel price daily revision, petrol price, Diesel price, today petrol rate, today diesel rate, petrol price today, diesel price today, Petrol, Diesel, petrol price on 31st May 2018, diesel price on 31st May 2018, Petrol Price in India, Diesel price in India, petrol prices, Diesel prices, IOC

The Indian Oil Corporation reduced the price of petrol by 7 paise and diesel by 5 paise. On another hand the price of a subsidised liquefied petroleum gas had been cylinder increased by Rs 2.2 and by Rs 77 for non-subsdised cylinder in New Delhi.

పైసల్లో తగ్గిన ఇం‘ధనం’.. పెరిగిన గ్యాస్ సిలిం‘డర్’ ధర..

Posted: 06/01/2018 12:07 PM IST
After fuel now lpg cylinders to be costlier

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. తగ్గింపు ధరలపై అటు కేంద్రంలోని మోదీ సర్కారుతో పాటు ఇటు అయిల్ కంపెనీలపై కూడా నెట్ జనులు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నా.. ఇంధన సంస్థలకు మాత్రం దున్నపోతుపై వానపడిన చందంగా చాలా లైట్ గా తీసుకుంటున్నాయి. మొన్న రూపాయి మేర ఇంధన ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన క్రమంలో వెనువెంటనే తమ నిర్ణయాన్ని మర్చుకుని కేవలం ఒక్క పైసా మాత్రమే తగ్గింపునిచ్చిన అయిల్ సంస్థలు.. నిన్న 7 పైసలు తగ్గింపునివ్వగా.. ఇవాళ కేవలం అరు పైసల తగ్గింపును వర్తింపజేశాయి.

పేరుకు మాత్రం ఇంధన ధరలు వరుసగా మూడు రోజుల పాటు తగ్గినా.. అసలు విషయానికి వస్తూ.. మూడు రోజుల తగ్గింపు కనీసం పావలా కూడా లేకపోవడంతో వాహనదారులు కేంద్రంతో పాటు అయిల్ సంస్థలపై మండిపడుతున్నారు. పెంచేప్పుడు ఏకంగా రూపాయల్లో పెంచే ప్రభుత్వాలు.. తగ్గింపు సందర్భంలో మాత్రం కేవలం పైసలకు మాత్రమే పరిమితం కావడమేంటని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.

కాగా ఎల్పీజీ గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. నాలుగేళ్లలో పెరిగిన ఎల్ పీజీ ధరలు సామాన్యుడికి పెద్ద గుదిబండగా పరిణమించాయి. రెండు రోజులుగా ఒక పైసా, ఐదు పైసలు అంటూ పెట్రోల్ ధరలను తగ్గిస్తూ వస్తున్న ఆయిల్ కంపెనీలు.. సిలిండర్ ధరను మాత్రం రూపాయిల్లో పెంచాయి. సబ్సీడీ కలిగిన గ్యాస్ సిలిండర్ ధరను రూ.2.34 పెంచారు. అదే విధంగా సబ్సిడీయేతర కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.48 పెరిగింది. ఒక్కసారిగా సిలిండర్ ధరలు పెంచటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలియకుండానే తమనెత్తిన బండ బాదుడు పడిందంటూ సామాన్యులు వాపోతున్నారు.

పెరిగిన ధరల ప్రకారం… దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.493.55 ఉండగా, కోల్ కతాలో అత్యధికంగా రూ.496.65కి చేరుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రూ.491.31, చెన్నైలో రూ.481.84 గా సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇక కమర్షియల్ LPG సిలిండర్ ధరలయితే భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన క్రమంలోనే గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయా.? అంటూ అందోళనగా చూసిన కస్టమర్లకు అనుకున్నట్లుగానే వారిపై బండపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LPG cylinders  subsidy lpg cylingder  non-subsidy lpg cylingder  oil price  petrol  diesel  

Other Articles