pranab to lecture on patriotism along with unity in diversity భిన్నత్వంలో ఏకత్వమా.? ఏదీ నీ చిరునామా.?

Pranab to lecture on patriotism along with unity in diversity

Pranab Mukherjee, Pranab Mukherjee news, Pranab Mukherjee RSS, RSS event, Sangh Shiksha Varg, Rashtriya Swayamsevak Sangh, Indian National Congress, Mohan Bhagwat, Nagpur, RSS headquarters, Pranab Mukherjee, Unity in Deiversity, Unity, Nationality, patriotism, RSS meet, Nagpur, crime rate, India, development

Former president pranab mukharjee, who is to attend rss anniversary at nagpur to deliver lecture on patriotism along with unity in diversity in India.

భిన్నత్వంలో ఏకత్వమా.? ఏదీ నీ చిరునామా.? ప్రశించనున్న దాదా

Posted: 06/01/2018 11:30 AM IST
Pranab to lecture on patriotism along with unity in diversity

భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం.. ఆ మాటను దాదాపుగా నాలుగేళ్ల నుంచి మర్చిపోయారా.? అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ పరిణామాలు ఎందుకు..? ఎలా చేటుచేసుకుంటున్నాయి. ఎందుకీ మార్పులు వస్తున్నాయి.? అని అన్న అలోచన కూడా ప్రజల్లో కలగడం లేదు. దేశంలో ప్రజల మధ్య విభేదాలు నూరిపోస్తున్న కొందరు పెద్దలకు అడుగులకు మడుగుల వత్తూతూ.. దేశంలోని ప్రజలు వర్గాలుగా, ఉపవర్గాలుగా చీలిపోతున్న పరిస్థితి వస్తుంది. అయితే ఈ చిలీకలు, పీలకల వల్ల వారికి ఒనగూరే ప్రయోజనం ఏమైనా ఉందా..? అంటే అదీ లేదు.

ఒకనాటి భారత దేశంలో దసరా వచ్చిందంటే ముస్లింలు హిందువుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి అలాయ్ భలాయ్ తీసుకుని మతసామరస్యాన్ని చాటేవారు. రంజాన్ వంటి పర్వదినాలకు హిందువులు ముస్లింల ఇంటికి వెళ్లి ఈద్ శుభాకాంక్షలు తెలిపి.. అలాయ్ భలాయ్ తీసుకునేవారు. పీర్ల పండగ వస్తే అందులో హిందువులే అధిక సంఖ్యలో పాల్గోనేవారు. ఇలా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూనే.. దేశం ఖ్యాతిని చాటుతూ.. జాతీయవాదానికి కట్టుబడి తమ పనుల్లో తాము నిమగ్నమయ్యేవారు. కానీ ఇప్పుడు మతాలుగా, కులాలవారీగా విడిపోతున్నారు. ఇది జాతీయవాదానికే ప్రమాదంగా పరిణమించే అంశం.

భిన్నత్వంలో ఏకత్వం అంటే మరో విధంగా చెప్పాలంటూ లౌకికవాదం. కులాలకు, మతాలకు, దేశంలోని ప్రాంతాలకు అతీతంగా ఒక దేశం ప్రజలందరూ తామంతా ఒక్కటే.. అన్న సంకేతాలు పంపినప్పుడే జాతీయవాదం బలపడినట్టు. ఇదే పరడవిల్లిన దేశంలో.. ప్రజలను ఏవో శక్తులు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా చీల్చివేస్తున్నాయి. అయితే ఐకమత్యంలో వుంది బలం.. విడిపోతే తప్పదు పతనం అన్న నానుడి చెప్పే పెద్దలకు దూరంగా.. ఉమ్మడి కుటుంబాల నుంచి నా ఇల్లు నా పిల్లలు అనే స్థాయికి వెళ్లడం కూడా ఈ పరిణమాలకు దారి తీస్తుందా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మనది అనే మాట నుంచి నాది అనే వరకు వెళ్లిన సమాజం.. ఇక నాది అనే మాట నుంచి నేను అనే వరకు వెళ్లేందుకు కూడా ఎంతో కాలం పట్టదేమోనన్న అవేదనన కూడా వ్యక్తం చేస్తున్నారు పలువురు సమాజహితులు. నేను అన్న భావన వచ్చిందంటే ఇక వారిని ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, లేక ఏ జాతీయవాదము కూడా అడ్డుకోలేదని వారు అందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే దిశగా.. వేపచెట్టులాంటి పెద్దల నీడలోనే కుటుంబాలు వుండేట్టుగా కార్యక్రమాలను చేపట్టాలి. అప్పుడే నేరరహిత సమాజం, ఐకమత్యం, బిన్నత్వంలో ఏకత్వం, జాతీయవాదం సహా దేశం అభివృద్దికి కూడా దోహదం చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదే విషయాన్ని ఆరెస్సెస్ స్నాతకోత్సవానికి హాజరు కాబోతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యఅతిధిగా ప్రసంగించనున్నారని తెలుస్తోంది. నాగ్ పూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్న ఆయన బీజేపీ జాతీయ వాదానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ జాతీయవాదం గురించి మాట్లాడి షాకివ్వనున్నట్టు సమాచారం. బీజేపీ జాతీయవాదానికి, బీజేపి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం కూడా అనర్థాలకు దారితీసి అలమరికలు లేని సమాజంలో వర్గ విభజనను చేస్తుందని ఆయన ప్రసంగించనున్నారని తెలుస్తుంది. జూన్ 7న జరగనున్న ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ ప్రసంగం దేశం గర్వించేలా ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranab Mukherjee  Unity in Deiversity  Unity  Nationality  patriotism  RSS meet  Nagpur  crime rate  India  development  

Other Articles