JD-U blames fuel price hike for Bihar bypoll defeat మీతో వున్నందుకే మమల్ని ఓడించారు

Stop ignoring allies jdu tells bjp after bypoll losses

nda, jdu, bjp, bypolls 2018, assembly bypolls 2018, lok sabha bypolls 2018, kc tyagi, kairana, noorpur, jokihat, 2019 lok sabha elections, Bypoll Results, BJP, Uttar Pradesh, Maharashtra, Nagaland Lok Sabha seat, Shiromani Akali Dal, Kairana bypoll

JD-U General Secretary K.C. Tyagi said: "Rising price of petrol and diesel mainly angered people that led to our defeat in Jokihat and NDA elsewhere"

మీపై వున్న వ్యతిరేకతే ఓటమికి కారణం: బీజేపిపై జేడీయు పైర్

Posted: 06/01/2018 12:54 PM IST
Stop ignoring allies jdu tells bjp after bypoll losses

ఉపఎన్నికలలో తమ సిట్టింగ్ స్థానాలను ప్రత్యర్థులకు కొల్పోయిన నేపథ్యంలో బీజేపికి అటు విపక్షాల నుంచే కాకుండా ఇటు మిత్రపక్షాల నుంచి కూడా అక్షింతలు పడుతున్నాయి. మోడీ నాలుగేళ్ల అబద్దాల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని విపక్షాలు అరోపిస్తుండగా, మీపై వున్న కోపంతో మాకు కూడా వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారని బీజేపి మిత్రపక్షాలు అరోపణలు చేస్తున్నాయి. బీహార్ లో రెండు మాసాల క్రితం జరిగిన ఉపఎన్నికలలో అరార్య లోక్ సభ స్థానంలో పాటు జెహనాబాద్ అసెంబ్లీ స్థానాన్ని జేడీయు నుంచి అర్జేడీ కైవసం చేసుకుంది.

దీంతో ప్రజా వ్యతిరేకత అర్థమైన జేడియు ఇటీవల జరిగిన జోకిహాత్ అసెంబ్లీ ఉపఎన్నికలో ప్రజామోదం వున్న నేతను వెతికి మరీ నిలబెట్టింది. అయినా ఆ అభ్యర్థి కూడా ఉపఎన్నికలలో గెలువలేకపోయాడు. దీంతో మహాగట్ బంధన్ పేరుతో అర్జేడీ, కాంగ్రెస్ లతో కలసి అధికారంలోకి వచ్చిన తరువాత.. వాటి స్నేహబంధం వీడి.. బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వచ్చిన ఉపఎన్నికలలో జేడీయు వరుసగా బిహార్ లో తమ పట్టుకోల్పోతున్న సంకేతాలు ఉప ఎన్నికలలో వెల్లడవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక దిద్దుబాటు చర్యలకు జేడీయు సిద్దమైంది.

బీజేపీతో కలిసున్నందునే ఉప ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి మండిపడ్డారు. జోకిహాత్ అసెంబ్లీ స్తానంలో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ ఖాన్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తప్పును బీజేపీపై నెట్టేశారు కేసీ త్యాగి. రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజాగ్రహం ఓట్ల రూపంలో కొంప ముంచిందని, తక్షణం పెట్రోలు ధరలను తగ్గించే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితో పాటు పెరుగుతున్న ధరలను ఎప్పటికప్పుడు కేంద్రం నియంత్రించాలని త్యాగి డిమాండ్ చేశారు.ఇక కేంద్రంతో వున్న మిత్రపక్షాలను విస్మరించకుండా ఎప్పటికప్పుడు వారితో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలను పంచుకుంటే మంచిదన్న సూచన కూడా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles