modi govt trolled as fuel price reduced by ekpaisa పైసా కనుమరుగైనా.. వార్తల్లో నిలిపిన ప్రధానిపై సెటైర్లు

Twitter goes into a frenzy after fuel prices reduced by ekpaisa

#EkPaisaJoke #EkPaiseKiSarkar #EkPaisaCut #EkPaiseCut #EkPaisa #PetrolParEkPaiseKaMazaak #PetrolPrice #PetrolDieselPrice #petrolparekpaisekamazak, one paisa joke, one Paisa Cut, one Paisa, PetrolPrice, OnePaisa, PM Modi, Oil companies

Netizens troll after facing non-stop criticism over the steep rise in fuel prices, the modi government gave a respite to the poor junta by slashing the price by a MASSIVE one paisa per litre.

పైసా కనుమరుగైనా.. వార్తల్లో నిలిపిన ప్రధానిపై సెటైర్లు

Posted: 05/31/2018 03:03 PM IST
Twitter goes into a frenzy after fuel prices reduced by ekpaisa

సోషల్ మీడియా ఊగిపోవటం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు చూడండి. ఎప్పుడో అణాల కాలంలో లేదా స్వాత్రంత్యం వచ్చిన న తరువాత సుమారు ఓ మూడు, నాలుగు దశాబ్దాల వరకు వున్న నాణెం పైసా. ఇక 80 తరువాత జన్మించిన జనరేషన్లకు తెలియది కూడా పైసానే. ఎందుకంటే అప్పటి నుంచి ఐదు లేదా పది లేదా పావలా లేదా అర్థరూపాయి ఇవి మాత్రమే చెల్లుబాటయ్యాయి. అసలు తమకు తెలియని పైసా గురించి.. ప్రధాని ఒక్కసారిగా వార్తల్లోకి తీసుకురావడంపై ఇప్పటి జనరేషన్లు (పైసా గురించి తెలియని వారు) ఎలా స్పందిస్తున్నారో చూడండీ..

పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో ఇప్పుడు దేశం మొత్తం ఇలాగే ఉంది. రేట్లు పెరిగినందుకు కాదు.. పైసా తగ్గినందుకు. తిట్టటం మానేసి.. పైసాపై ప్రేమ కురిపిస్తున్నారు నెటిజన్లు. ఫుల్ జోక్స్ పేలుస్తున్నారు. తమలోని క్రియేటివిటినీ బయటకు తీశారు. తగ్గించకపోయినా పర్వాలేదు.. పైసా తగ్గించి అవమానించారంటూ నెటిజన్లు దుమ్మెత్తిపొస్తుంటే.. మరికొందరు ఒక్క పైసాను పెట్టుబడి పెట్టటం ఎలాగో చెబుతున్నారు.. మరికొందరు ఏయే వస్తువులు కొనుగోలు చేయొచ్చో తమదైన స్టయిల్ లో చెప్పుకొస్తున్నారు. 24 గంటలుగా ఇదే విషయంపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. పైసాకు విలువ ఎక్కడిది అనేవాళ్లకు ఇవే సమాధానం..

పైసాపై సోషల్ మీడియాలో జోక్స్ ఇలా ఉన్నాయి :

పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క పైసా తగ్గడానికి మాజీ ప్రధాని నెహ్రూనే కారణం. ఎందుకంటే పైసాను చలామణిలోకి తెచ్చింది ఆయనే.
పెట్రోల్ ఒక్క పైసా తగ్గింది. వెంటనే ట్యాంకు ఫుల్ చేయించుకోండి. ఇలాంటి మంచి తరుణం మళ్లీ రాదు.
పైసామే పరమాత్మ.. ఒక్క పైసా అంటే మాటలా.. నేను ఇప్పుడే ఈ పైసాతో పెట్టుబడి పెట్టేస్తా
ప్రధాని మోడీ విక్టరీకి ఇదే నిదర్శనం.
ఈ పైసాతో నేను వెంటనే డిస్కొంట్ రేట్లలో కారు కొంటాను
ఎంత ఆనందంగా ఉందో. కోటీశ్వరుడిని అయ్యాననే భావన కలుగుతోంది.
పైసా తగ్గించినందుకు.. రాకెట్ పై దూసుకెళుతున్న ఫీలింగ్ వచ్చింది
ఆదా అయిన ఇంత మొత్తాన్ని ఏం చేసుకోవాలో. ఒక్క పని చేస్తా... జన్ ధన్ ఖాతాలో జమ చేస్తా.
ఈ పైసలతో నేను వెంటనే అపార్ట్ మెంట్ కొనుగోలు చేయటానికి అగ్రిమెంట్ చేసుకుంటాను
పైసా తగ్గించినందుకు ఎంతో రుణపడి ఉంటాం. ఈ పైసాతో ఏం కొనుగోలు చేయొచ్చో లిస్ట్ ఇస్తే బాగుంటుంది.
ఈ పైసలతో ఏం చేయాలి అనే దానిపై ప్రజలందరూ క్యాలిక్యులేటర్లతో కుస్తీ పడుతున్నారు
భాయీ సాబ్... నేనైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.
ఒక్క రూపాయి పొదుపు చేయాలి అంటే.. ఒక్కొక్కరు 100 లీటర్ల ఆయిల్ కొట్టించుకోవాలి.
ఇక నుంచి పైసా డిస్కొంట్ ఆఫర్ కు ఇదో ప్రేరణ
వచ్చే నెల బడ్జెట్ ప్లాన్ ముందుగానే తెలిసిపోయింది.
600 కోట్ల మంది ఇండియన్స్ కు ఇది బిగ్ రిలీఫ్
బ్యాంకులు బంద్ కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఈ పైసాతో వారి ఆదాయం డబుల్ అయ్యేది.
బ్యాంక్ ఉద్యోగులు బంద్ నిలిపేసి.. పెట్రోల్ కొట్టించుకుంటే సరిపోతుంది. జీతాల మందం.. ఇక్కడ మిగిలిపోతుంది.
మోదీ సార్... ప్రజలపై మీకు ఉన్న సానుభూతి వెలకట్టలేనిది. మీ రుణం తీర్చుకోలేము.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : EkPaisaJoke  EkPaisaCut  EkPaisa  PetrolPrice  OnePaisa  PM Modi  Oil companies  

Other Articles