Indebted to Congress: Kumaraswamy సీఎం అయ్యానంటే అది..: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

At mercy of congress and not 6 5 cr people of karnataka kumaraswamy

kumaraswamy loan waiver, kumaraswamy farm loan, kumaraswamy congress, Karnataka CM, h d kumaraswamy, people mandate, chief minister, congress, karnaraka, politics

Karnataka CM Kumaraswamy said he was at the 'mercy' of Congress and not the 6.5 crore people of Karnataka as his government had not received the full mandate which his party had sought in the assembly elections.

సీఎం అయ్యానంటే అది..: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

Posted: 05/28/2018 09:49 AM IST
At mercy of congress and not 6 5 cr people of karnataka kumaraswamy

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన పార్టీని ప్రజల అశీర్వదించి అధికారంలోకి తీసుకురాలేదని, వారి తిరస్కారానికి తాను గురయ్యానని చెప్పారు. తాను ఇవాళ ముఖ్యమంత్రిగా నియమించబడటం కేవంలో కాంగ్రెస్ పార్టీ దయతోనేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్తున్న ఆయన తాను ఎవరి దయతో ముఖ్యమంత్రిని అయ్యానన్న విషయాన్ని మరోమారు కుండబద్దలు కొట్టేలా స్పష్టం చేశారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూడా ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు తననెందుకు తిరస్కరిస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆరున్నర కోట్ల మంది కన్నడిగుల ఓట్లతో తాను ముఖ్యమంత్రిని కాలేదని, కాబట్టి తనపై ఒత్తిడి ఉండే అవకాశం లేదని అన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను కలసిన రైతు సంఘం నాయకుల ద్వారా, రైతుల ద్వారా రైతుల సమస్యలను అర్థం చేసుకున్నానని, వారి కన్నీళ్లు తుడిచి రైతు రుణాలను మాఫీ చేయడానికి కూడా తాను శాయశక్తులు ప్రయాత్నిస్తానని చెప్పారు.

రైతులకు, రైతు సంఘాల నాయకులకు తానిచ్చిన హామి మేరకు రైతు రుణాల మాఫీయే తన లక్ష్యమని, దానిని నెరవేర్చని పక్షంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని కుమారస్వామి పేర్కొన్నారు. ప్రస్తుతం తన పార్టీ సొంతంగా అధికారం చేపట్టనందుకు తనకు కూడా కొన్ని పరుధులు, ఒత్తిడిలు వున్నాయని చెప్పుకోచ్చారు. అయినా తాను రైతు రుణాల మాఫికి కట్టుబడి వున్నానని అన్నారు. అయితే రైతుల రుణాలు మాఫి చేసేంత వరకు వారు కాసింత సంయమనం పాటించాలని, ఆత్మహత్యల దిశగా ఎవరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కుమారస్వామి విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka CM  h d kumaraswamy  people mandate  chief minister  congress  karnaraka  politics  

Other Articles