NTR 95th birth anniversary: family, fans pay tributes ‘అన్న’గారికి తెలుగోడి ఘన నివాళులు

Ntr 95th birth anniversary family fans pay tributes

Senior NTR, ntr 95th birth anniversary, Nandamuri Taraka RamaRao, jr ntr tribute to ntr, family members tribute to ntr, Hari Krishna, Kalyan Ram, Jr NTR, NTR Fans, TDP party men, Ramanna, Andhra pradesh, Telugu States

former chief minister of andhra pradesh, telugu desam party founder Nandamuri Taraka RamaRao 95th Birth anniversary celebrations at NTR Ghat, family, fans and party members pay tribute to him.

రామన్నా.. నిన్ను స్మరించని తేలుగు నేల ఏదన్నా.!

Posted: 05/28/2018 10:27 AM IST
Ntr 95th birth anniversary family fans pay tributes

ఆంధ్రుల ఆరాధ్యుడు, తెలుగువాడిని మద్రాసీ అనికాకుండా.. ఆంధ్రావాలా అని ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిన నాయకుడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనతో నిజమైన బడుగు, బలహీన వర్గాలకు అధికారాన్ని అందించిన నేత, మండల్ కమీషన్ వ్యవస్థ ఏర్పాటుతో రాష్ట్రంలోని అధికారం అన్ని వర్గాలకు అందించిన మహానాయకుడు, దివంగత నేత, అన్నగారిగా తెలుగు ప్రజలతో పిలుపించుకన్న పెద్దన్న.. పేదవాడికి రెండుపూటలా అన్నం పెట్టిన ఆరాధ్యుడు.. తాను నమ్మిన సిద్దాంతం రాజకీయాలకు వీడిన నాయకుడు.. ఇప్పటికీ తెలుగు ప్రజల దృష్టిలో రాముడు, కృష్ణుడిగా పూజలందుకుంటున్న దేవుడు.. ఇవన్నీ ఒక్కే ఒక్కడు.. అతనే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు.

ఆచంద్రతారార్కం అతని పేరు తెలుగు నేలపై స్మరించాల్సిందే. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజల హౄదయాలలో గూడుకట్టుకున్న ఆయనను తెలుగువారు స్మరించని రోజంటూ వుండదు. అతను చేసిన సేవలు.. తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. అణగారిన వర్గాల్లో అతను తీసుకువచ్చిన చైతన్యం.. తొక్కేవాడితే రిక్షా.. దున్నేవాడిదే భూమి అన్న నినాదాలు.. అన్ని వర్గాల ప్రజలను అతని అలోచనలతో అకర్షించి మహానేత ఎన్టీఆర్. ఆయన 95వ జయంతి సందర్భంగా అనేక మంది తెలుగు ప్రజలు ఆయనకు ఇవాళ ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అన్నగారి చైతన్యరథసారధి.. ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ సహా రామన్న కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ సందడిగా మారింది.
నందమూరి హరికృష్ణతో పాటు ఆయన కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే బాధ్యతలను తలకెత్తుకున్న క్రిష్ కూడా ఘాట్ కు వచ్చి ఆన్నగారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుగు రాష్ట్రాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hari Krishna  Kalyan Ram  Jr NTR  NTR Fans  TDP party men  Ramanna  Andhra pradesh  Telugu States  

Other Articles