Motkupalli sensational comments on Chandrababu చంద్రబాబుపై మోత్కుపల్లి తిరుగుబాటు బావుటా..

Ttdp leader motkupalli narasimhulu sensational comments on ap cm

TTDP, Motkupalli Narasimhulu, TTDP Leader Motkupalli, Motkupalli Narasimhulu Press Meet, AP CM Chandrababu Naidu, Motkupalli Fires On Chandrababu, Motkupalli Narasimhulu Comments On Chandrababu, Motkupalli Comments On TDP Govt, Motkupalli Narasimhulu Speech, Motkupalli Narasimhulu About Chandrababu, Chandrababu Comments on Motkupalli, Telangana TDP Leaders, politics

Telangana TDP Leader Motkupalli Narasimhulu Sensational Comments On Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, slams him on making him quit from party.

ITEMVIDEOS: చంద్రబాబుపై మోత్కుపల్లి తిరుగుబాటు బావుటా..

Posted: 05/25/2018 07:56 PM IST
Ttdp leader motkupalli narasimhulu sensational comments on ap cm

టీడీపీ నుంచి తనను గెంటేసే కుట్ర జరుగుతుందన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు. 30ఏళ్లుగా పార్టీకోసం నిజాయితీగా పనిచేస్తున్నా తనకు…అదే పార్టీలో పరాభవాన్ని చవిచూడాల్సి రావడం అందోళన కలిగిస్తుందని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కావచ్చు కానీ.. తమ లాంటీ సీనియర్ నేతలకు కూడా చెందాల్సిన కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు పార్టీని విడిచి వెళ్లినా.. కష్ట సమయాల్లో అండగా ఉన్నానని చెప్పారు. ఎన్నో ఆపదల నుంచి బాబును కాపాడానన్నారు.

నేను పెద్ద దళితుడిని అన్న చంద్రబాబు.. మాట్లల్లో ప్రేమను కనబర్చే తప్ప.. చేతల్లో మాత్రం ఏమీ చూపలేదన్నారు. తాను నిజంగా ఆ మాటలకు కట్టబడి వుంటే.. తనను చిన్నచూపు ఎందుకు చూసేవారని ప్రశ్నించారు. మోత్కుపల్లి. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తుందని.. తనకు గవర్నర్ పదవి రాకుండా ఆపింది నిజం కాదా అని బాబును ప్రశ్నించారు మోత్కుపల్లి. ఇది కుట్ర కాదా అని ప్రశ్నించారు. నాకు ఇవ్వాల్సిన ఎంపీ పదవిని.. గరికపాటి, టీజీ వెంకటేష్ కు ఇవ్వలేదా అని నిలదీశారు. పిచ్చుకపై బ్రహ్మోస్త్రంగా నాపై ఎందుకు ఇంత పగ పట్టారని నిలదీశారు బాబుని. మిమ్మల్ని నమ్మి పని చేసినందుకు షుగర్ వ్యాధి కూడా వచ్చిందన్నారు.

ఇప్పటికైనా నన్ను పిలవాలని.. లేదంటే ఆంధ్రకు వచ్చి ఊరూరూ తిరిగి ఏం తప్పు చేశానో చెబుతా అన్నారు. తాను మీటింగ్ పెట్టినా 10వేల మంది వస్తారని.. అలాంటిది మహానాడుకి ఎందుకు అంత తక్కువ మంది వచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబు లేదా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ తనకు మంచి మిత్రుడు అని.. ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం ఏంటి అన్నారు. పార్టీ నుంచి గెంటేయటానికి టీడీపీలో కుట్ర జరుగుతుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా టీడీపీలోంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డిని తాను విమర్శించినందుకే జరుగుతుందని అనుమానాన్ని వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Motkupalli Narasimhulu  Chandrababu  Telangana TDP  TDP Leaders  Andhra Pradesh  Telangana  politics  

Other Articles