prakash raj sensational comments on pm modi ప్రధాని మోడీపై ప్రకాష్ రాజ్ వ్యంగస్త్రాలు..

Actor prakash raj critisizes pm modi on his kannada language

prakash raj, kannada, Siddaramaiah, PM Modi, Rahul Gandhi, Yeddyurappa, Janardhan Reddy, Amit Shah, Nagaraju, RSS pre-poll survey, Congress, BJP, RSS, JDS, Kumara Swamy, karnataka, politics

Reowned Actor Prakash Raj made sensational comments on PM Narendra Modi, says he will be at liesure after 2019 general elections, if he comes than to karnataka his people will assist him in learning kannada.

ప్రధాని మోడీపై సినీనటుడు ప్రకాష్ రాజ్ వ్యంగస్త్రాలు..

Posted: 05/03/2018 06:38 PM IST
Actor prakash raj critisizes pm modi on his kannada language

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన తరువాత ఇప్పుడా పని తన భుజాపైకి ఎత్తుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. కన్నడీగులను తన వైపుకు అకర్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలించాయో కానీ విమర్శకులైతే మాత్రం ఆయనను ఎద్దేవా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ సోదరుడు, సినీనటుడు, సాహితీవేత్త ప్రకాష్ రాజ్ ప్రధానిపై తన వ్యంగస్త్రాలను సంధించాడు. వచ్చే ఏడాది నుంచి మోడీతో దేశ ప్రజలకు పెద్దగా పనేమీ వుండదని, అప్పడు వస్తే తమ వాళ్లు చక్కగా తమ బాషను నేర్పిస్తారని ఎద్దవా చేశారు.

‘ప్రధాని మోదీ గారూ..! 2019 తర్వాత దేశంలో మీకు అంతగా పనేం ఉండదు. కర్ణాటక వచ్చేస్తే మా వాళ్లు కూర్చోబెట్టి కన్నడ భాష నేర్పిస్తారు. ఏమిటండీ.. ఎన్నికల ప్రచార సభల్లో మీ కన్నడ ప్రసంగం..!’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నాలుగైదు సభల్లో ప్రధాని మోదీ మాట్లాడిన కన్నడ ప్రసంగాన్ని అనుకరించి చూపించారు. ఏమిటండీ ఈ భాష కాయగూరలు అమ్మినట్లు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో స్థానిక ఎస్‌.ఎన్‌.ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ఎన్నికల నేపథ్యంలో సింధనూరులో దళిత, ప్రగతిపర సంఘాలు ‘ప్రజాస్వామ్య రక్షణ కోసం’ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ప్రసంగించారు.

ప్రధానిని విమర్శించినంత మాత్రన తాను ఏదో ఒక పార్టీకి చెందిన వ్యక్తినని ముద్రవేసేస్తారేమో.. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాను అని ఆయన స్పష్టం చేశారు. ఇక తనకు బీజేపి వాళ్లతో ఏం భయం లేదని, వాళ్లు తననేమీ చేయలేరని చెప్పారు. బీజేపి నాయకులు తమది ప్రభంజనమని చెబుతూ.. సునామీ, ప్రళయాలతో పోల్చుకుంటున్నారు. సునామీలు దేశానికేమైనా మేలు చేసేవా? అని ప్రశ్నించారు. ఇక రాహుల్ గాంధీ ప్రసంగంతో పోటీ పడుతున్న మోదీని ప్రకాష్ రాజ్ తీవ్రంగా విమర్శించారు.

‘రాహుల్‌ వయసెంత..మీ వయసెంత మోదీజీ.. సిగ్గుగా లేదా’ అని అన్నారు. రాహుల్ పార్లమెంటులో 15 నిమిషాల వ్యవధి కావాలని కోరుతుంటే.. మీరు కర్ణాటక ప్రభుత్వం ప్రజల కోసం ఏం పథకాలు ప్రవేశపెట్టిందో పేపర్ చూడకుండా చెప్పాలని అడగటం ఎలా సమంజసమని ప్రశ్నించారు. చమత్కారాన్నంతా రుద్ది మసిపూసిన మారేడు కాయను చేసి.. ప్రజల చెవిలో పువ్వులు పెట్టగల ఘనులు మీరని.. అనవసరమైన విషయాలను పెద్దగా చూపి.. అవసరమై వాటిపై మాత్రం మౌనం వహించే మీ చతురత రాహుల్ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. ‘ఈ నెల 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలే చెబుతాయి. ఇక్కడ మీ ప్రతాపం ఎంతుందో? ఇక్కడి నుంచే బీజేపి పతనం ఆరంభం అమవుతుంది’ అని జోస్యం చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prakash raj  kannada  Siddaramaiah  PM Modi  Rahul Gandhi  karnataka  politics  

Other Articles