Rahul Gandhi targets PM Modi, says Congress on comeback మోడీని టార్గెట్ చేసిన రాహుల్, పూర్వవైభవం వస్తుందని ధీమా

Modi didn t speak a word about doklam in china says rahul gandhi

Jan Akrosh rally, Rahul Gandhi, Congress, Nirav Modi, Sonia Gandhi, bharatiya janata party, China, Salman Khurshid, NEW DELHI, Amit Shah, Assam, Ghulam Nabi Azad, Jammu, Piyush Goyal, politics

Congress President Rahul Gandhi questioned PM Modi's silence over various issues including Justice BH Loya death case. He said for the first time in 70 years, four Supreme Court judges came in front of the people and asked for justice.

మోడీని టార్గెట్ చేసిన రాహుల్, పూర్వవైభవం వస్తుందని ధీమా

Posted: 04/30/2018 11:02 AM IST
Modi didn t speak a word about doklam in china says rahul gandhi

కాంగ్రెస్ పార్టీకి రానున్న 2019వ సంవత్సరం బాగా కలసివస్తుందని, ఈ ఏడాది నుంచి కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సంతరించుకునే బాట పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి కాంగ్రెస్ ఇక విజయాల బాటలో పయనిస్తుందన్నారు. మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికలు సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన జనాక్రోశ్ సభలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, అభివృద్ది పేరు చెప్పే పార్టీ దానికి అమడదూరంగా నిలిచిందని ఎద్దేవా చేశారు.

దేశంలో త్వరలో గణనీయమైన మార్పు కనిపించబోతోందని రాహుల్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఇక వరుసపెట్టి విజయాలను సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన రాహుల్.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా తాము అధికారంలోకి వస్తామని.. బీజేపీ-అర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి గద్దెనెక్కుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానిపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టిన రాహుల్..  ‘ఈయనేం ప్రధాని’.. ఓ వైపు డోక్లాంలో చైనా హెలీప్యాడ్ నిర్మిస్తుంటే ఈయన చైనా పర్యటనకు వెళ్లొచ్చారని ఆక్షేపించారు. చైనా అధ్యక్షుడితో కలిసి చాయ్ తాగిన ఆయన డోక్లాం విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.

ఏటా రెండు కోట్లమందికి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని, కానీ, ఇప్పుడు ఎక్కడ చూసినా నిరుద్యోగం తప్ప ఇంకోటి కనిపించడం లేదన్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అన్నవారే వారిపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేశారని, ఇక ఇద్దరు మంత్రులు అత్యాచార నిందితులకు వెన్నుగా నిలచారని రాహుల్ గుర్తు చేశారు. దేశాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తనకు ఐదేళ్ల సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా రాహుల్ కోరారు.

తమ పార్టీ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్.. తమ పార్టీలో అందరి అభిప్రాయాలకు చోటు కల్పిస్తామని చెప్పిన ఆయన ఇదే అమిత్ షా- నరేంద్రమోడీ నేతృత్వంలోని పార్టీలో వారి అభిప్రాయాలనే ప్రజలపై రుద్దుతారని చెప్పిన ఆయన.. తాము ఎవరి అభిప్రాయాలను పంచుకోరని ఎద్దేవా చేశారు. ప్రజలకు మాత్రం పేద్దల మాటలను వినాలని, వారిని గౌరవించాలని చెప్పే ప్రధాని.. అచరణలో మాత్రం వారే తమ పార్టీ పెద్దల మాటలను లక్ష్యపెట్టరు. వారికి కనీసం గౌరవమర్యాదలు కూడా ఇవ్వరని విమర్శించారు.

గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీసం 50 స్థానాలు కూడా రావని విమర్శించిన నేతలు.. కాంగ్రెస్ ప్రభంజనం చూసిన ప్రధాని తనపై హత్యాయత్నం జరుగుతుందని సానుభూతి వ్యాఖ్యలతో అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ కార్యకర్తలు దీక్ష, పట్టుదల ముందు తలవంచుకన్న మోదీ.. సముద్రం మార్గంలో సముద్రవిమానం ద్వారా పారిపోయారని ఎద్దేవా చేసిన ఆయన ఇక కర్ణాటక ఎన్నికలలో ఎలా పారిపోతారో వేచి చూడాలని విమర్శించారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానన్న మోడీ.. కర్ణాటకలో అవినీతి ముద్రపడిన యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jan Akrosh rally  Rahul Gandhi  Congress  PM Modi  Nirav Modi  Sonia Gandhi  BJP  China  Politics  

Other Articles