Petrol prices stay at peaks for 7th day క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. వారం రోజులుగా స్థిరంగా పెట్రోల్ ధర..

Fuel prices not revised for seven days is it karnataka poll effect

petrol, Karnataka elections 2018, diesel, oil companies, Union government, crude oil, US. Petrol Price in India, Brent Crude, oil prices, Markets

The OMCs have kept petrol price unchanged for seventh consecutive day in various state capitals in India despite international crude oil prices edged lower.

క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా.. వారం రోజులుగా స్థిరంగా పెట్రోల్ ధర..

Posted: 04/30/2018 11:52 AM IST
Fuel prices not revised for seven days is it karnataka poll effect

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో వస్తున్న మార్పులను అనుసరించి దేశవాళీ చమురు సంస్థలు ఏ రోజుకా రోజు ఇంధన ధరలను సవరిస్తూన్నా.. గత వారం రోజులుగా మాత్రం ఈ ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా పెట్రోల్ ధరలో మాత్రం దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ధరలు వారం రోజులగా ఒకే విధంగా వున్నాయి. అయితే ఇది కేవలం.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరల సవరణ వద్దని ప్రభుత్వం చమురు కంపెనీలను కోరిందన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నా.. అసలు విషయం మాత్రం ఇది కాదని స్పష్టంగా తెలుస్తుంది.

గత మంగళవారం నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా వుండటం వెనుక అసలు కారణం మాత్రం వేరే వుంది. దాదాపుగా ఇప్పడున్న పెట్రోల్ ధర మాత్రం ఏకంగా ఆరేళ్ల గరిష్టస్థాయికి చేరిందన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడున్న బ్యారెల్ క్రూడ్ అయిల్ ధరతో పోల్చితే ఇప్పుడున్న బ్యారెల్ క్రూడ్ అయిల్ ధరకు చాలా వ్యతాసం వుంది. అప్పట్లో 115 డాలర్లు వుండగా, ఇప్పుడు కేవలం 75 డాలర్లుగా మాత్రమే వుంది. అయితే పెట్రోల్ ధర మాత్రం గణనీయంగా పెరిగింది.

గత వారం రోజులుగా అంతర్జాతీయంగా 75 డాలర్లు వున్న క్రూడ్ అయిల్ ధర సల్పంగా తగ్గి 74.25 డాలర్లుకు చేరింది. అందుకు అమెరికా చమురు అత్యధిక ఉత్పాదనే కారణంగా మారింది. అయినా ధరలు మాత్రం అందుకు అనుగూణంగా తగ్గించాల్సి వుండగా, ఇంధన కంపెనీలు మాత్రం ఆ పని చేయలేదు. దీంతో పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో లీటరుకు రూ. 74.63, డీజిల్ రూ. 65.93 వద్దే ఉంది. హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 79.04, డీజిల్ ధర రూ. 71.63 వద్ద కదలకుండా ఉంది. ఇంధన సంస్థలు ఇలా చేయడంతో ఇక ధరలు పెరిగే ట్రెండ్ కు బ్రేక్ పడిందా.? అన్న సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

ధరలు పెరిగిన నేపథ్యంలో మాత్రం ఇంధన సంస్థలు కూడా లీటరుకు ఒక్క రూపాయి పెరుగుదలను భరించాలని కేంద్రప్రభుత్వం కోరిందని సమాచారం. ఇక ఇదే ధరల తగ్గింపు విషయంలోనూ ఇవ్వాలని అయిల్ సంస్థల వినతితో ధరల తగ్గింపు క్రమంలో రూపాయి లాభాన్ని కూడా ఇంధన సంస్థలు పొందుతున్నాయి. అందుచేతే అంతర్జాతీయంగా సుమారుగా 0.5 శాతం (39 సెంట్ల) మేర ధరలు తగ్గినా చమురు సంస్థలు మాత్రం ఇంధన రేట్లను స్థిరంగానే కోనసాగిస్తున్నారన్న వార్తులు వినడడుతున్నాయి. ఇక మరోవైపు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ కొంతకాలం ఇంధన ధరలు సవరణలు జరగవన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  oil companies  crude oil  US. Brent Crude  oil prices  Markets  

Other Articles