pawan kalyan tweets again inspiring youth యువతకు ప్రేరణ కల్పిస్తూ.. జనసేనాని పవన్ ట్వీట్

Pawan kalyan janasena to contest in 2019 assembly elections in telugu states

pawan kalyan, janasena, Party activists, vemuri shanker goud, assembly elections, twitter, dusharla satyanarayan, sheshendra sharma,Telangana, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan party is ready to contest in both telugu states in forth coming assembly elections

ITEMVIDEOS: రెండు తెలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకీ జనసేన సన్నధం..

Posted: 04/30/2018 10:37 AM IST
Pawan kalyan janasena to contest in 2019 assembly elections in telugu states

రాష్ట్రంలో తృతీయ ప్రత్యమ్నాయ పార్టీగా అవిర్భవించిన జనసేన.. 2019లో జరగనున్న తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని మరోమారు స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తమ అభ్యర్థులు పోటీకి దిగుతారని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జీ వేమూరి శంకర్ గౌడ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో అన్ని జిల్లాలు, నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే తాము తమ కార్యకర్తలతో చర్చించామని అన్నారు. లక్షలాది మంది యువత తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ వెనుక ఉన్నారని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులోపు పవన్‌ కల్యాణ్.. జనసేన మేనిఫెస్టో ప్రకటిస్తారని, జనసేన దశ, దిశ ఎలా ఉండబోతుందో వివరిస్తారని నేమూరి శంకర్‌ గౌడ్‌ అన్నారు.  

ఇక మరోవైపు జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోమారు తన సామాజిక మాధ్యమం ద్వారా యువతలో ప్రేరణ కల్పించేలా.. ప్రసార మాధ్యమాల దిమ్మదిరిగేలా ఓ ట్విట్ చేశారు. ఈ సమాజంలోని ఎంతో మంది గొప్ప రచయితలు తనకు స్ఫూర్తినిస్తూ, తట్టి లేపుతుంటారని వారంతా నిశ్శబ్ద యోధులని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన అభిమాన రచయిత దుశర్ల సత్యనారాయణ రాసిన 'జల సాధన సమరం' పుస్తకం కవర్ పేజీని పోస్టు చేసిన ఆయన, మరో అభిమాన రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఓ కవితను తన ట్వీట్ లో పోస్టు చేశారు.

"మహితాత్ములు ఎందరు భువిలో
శ్వాస పీల్చి చాలించారో
భూమి మీద నిశబ్దంగా
నడిచి నిష్క్రమించారో
మైకు ఒక్కటి ముట్టలేదు
పత్రికలో మెట్టలేదు
వాళ్లంతా నడిచిన దారులు
వార్తలుగా మారలేదు
మెరిసే మకుటుం మినహా
శిరసె కనిపించని నూతన
రాజులు ఎంగిలి కూతలు
పేజీలైపోతుంటే
చప్పుడు చెయ్యని అడుగులు
చరిత్రలోకెక్కలేదు" అన్న కవితను పవన్ పోస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles