mid air scare: rahul was calm and composure ఆ అనుభవం భయానకం.. అయినా నిబ్బరంగా రాహుల్

Vidyarthee recollects mid air scare rahul was calm and composure

Aircraft glitch, Rahul Gandhi, Congress, PM Modi, Randeep Surjewala, Rahul S ravi, Kaushal Vidyarthee, karnataka, politics

congress president Rahul gandhi was very calm and composure during the mid air scare, recollects raga's close aide Kaushal K Vidyarthee said he was thankful for being alive.

ఆ అనుభవం భయానకం.. అయినా నిబ్బరంగా రాహుల్

Posted: 04/27/2018 12:56 PM IST
Vidyarthee recollects mid air scare rahul was calm and composure

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటనలో ఆ భయానక అనుభవాన్ని తలచుకుని విమానంలో వున్న ఎవరికి వారు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని భయాందోళనకు లోనుకాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం నిబ్బరంగా, ప్రశాంతంగా వున్నాడు. అందుకు కారణం ఆయన కూడా స్వయంగా పైలెట్ కావడమే. అయితే తనతో పాటు వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను కాదని.. ఆయన ఏకంగా పైలెట్ల వద్దకు వెళ్లి విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు గాను సలహాలు, సూచనలు ఇచ్చాడు.

అదో చిన్న చార్టర్ విమానం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని రాహుల్ గాంధీ, తన టీమ్ తో సహా వెళుతున్న వేళ.. ఒక్కసారిగా కుదుపులు. ఓ వైపు ఒరిగిపోయి అలాగే కిందకు జారుతోంది. భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. పైలెట్లు కష్టం మీద విమానాన్ని నడుపుతూ మెల్లిగా ఎయిర్ పోర్టు వైపు తీసుకు వస్తున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ.

విమానాన్ని ల్యాండింగ్ చేయాలని చేసిన తొలి ప్రయత్నం విఫలం. రెండోసారీ అదే ఫలితం. అసలు విమానం క్షేమంగా ల్యాండ్ అవుతుందా? అని హుబ్లీ ఎయిర్ పోర్టు అధికారుల్లో తీవ్ర ఆందోళన. మూడోసారి విమానం క్షేమంగా దిగింది. ఈ అనుభవంతో విమానంలో వున్న రాహుల్ టీమ్ అంతా భాయానక అనుభవం అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే రాహుల్ మాత్రం నిబ్బరంగా, ప్రశాంతంగా వున్నారని అయనను కొనియాడారు.

ఈ భయానక అనుభవాన్ని తలచుకున్న రాహుల్ ప్రధాన అనుచరుడు కౌశల్ విద్యార్థి.. తన జీవితంలోనే ఇది అత్యంత భయంకరమైన రోజుగా అభివర్ణించారు. విమానంలోని వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్న వేళ, రాహుల్ గాంధీ, ప్రశాంతచిత్తంతో కూర్చుని ఉన్నారని, ఆయనలో ఎటువంటి ఆందోళనా కనిపించలేదని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల మధ్య ఉన్నామని తెలిసి కూడా ఆయన నిబ్బరంగా ఉన్నారని అన్నారు. కొద్ది సేపటి తరువాత అయన నేరుగా పైలెట్ క్యాబిన్ వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారని చెప్పారు.

ఇక మరో ముఖ్య అనుచరుడు రాహుల్ ఎస్ రవి కూడా రాహుల్ గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు. స్వతహాగా పైలెట్ కావడం వల్లే రాహుల్ లో ఇంత నిబ్బరం వుందా..? లేక దేవుడే అతనికి ప్రసాదించాడా తెలియదు కానీ.. క్యాబిన్ క్రూ వద్దకు వెళ్లి విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో వారికి సహకరించాడని కొనియాడారు. అయితే విమానంలో సమస్య కావాలనే సృష్టించి ఉండవచ్చన్న అనుమానం తలెత్తిందని, దీనిపై సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక డీజీపీ ఎన్ నీల్ మణి రాజుకు కౌశల్ లేఖను రాశారు. కాగా, విమానం ల్యాండ్ అయిన తరువాత తన షెడ్యూల్ లో ఉన్న ఎన్నికల ప్రచారానికి రాహుల్ వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles