'Raised my voice as I realised society is in danger’ ఇదేనా ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’: ప్రకాష్ రాజ్

Prakash raj just asking is this sabki saath sabka vikas

prakash raj, BJP candidate wife, bjp asking votes, bjp religion, south karnataka, mangalore, communal politics, sabka saath sabka vikas, #just asking, karnataka, politics

South Indian actor Prakash Raj critisezes BJP candidate's wife asking on the basis of religion, questions PM Modi is this your 'sabka saath sabka vikas'..?

ITEMVIDEOS: ఇదేనా ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’: ప్రకాష్ రాజ్

Posted: 04/27/2018 12:13 PM IST
Prakash raj just asking is this sabki saath sabka vikas

కర్ణాటకలో ఎన్నికలలో ఆయన ఏ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం లేదు. కానీ ఆయనంటే బీజేపికి మాత్రం సింహస్వప్నం. అయన తన సామాజిక మాధ్యమాల ద్వారా సంధిస్తున్న ప్రశ్నలు ప్రజలను ఒకటికి రెండింతలు అలోచింపజేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి యోగి అదిత్యనాథ్ వరకు అందరినీ ఆయన తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడికి చేరుకునే జాతీయ నేతలు ఎవరైనా సరే.. వారు వచ్చివెళ్లిన తరువాత ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ప్రకాష్ రాజ్ ట్విట్ కోసమే. ఆయన ఎలా స్పందిస్తారన్న విషయాన్ని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తన సోదరి ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్య విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మౌనాన్ని వీడాలని ప్రారంభించిన ఆయన ప్రశ్నల వర్షం.. ఆ తరువాతే వచ్చిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా..? లేక సార్వత్రిక ఎన్నికల వరకు వుంటుందా.? అన్నది కూడా వేచి చూడాలి. తాజాగా ఆయన ఓ బీజేపి అబ్యర్థి సతీమణి ఓట్లు అడుతున్న విధానాన్ని ఎండగట్టారు. అమె మతాన్ని ప్రస్తావిస్తూ అక్కడున్న కొందరు మహిళలను ఓట్లు అడగటం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రచార వీడియోను ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ, ఇదేం పనని ప్రశ్నించారు.

"బీజేపీ అభ్యర్థి భార్య ఎలా ఓట్లను అడుక్కుంటోందో చూడండి. దక్షిణ కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో ఆమె మతాలను గుర్తు చేస్తూ తన భర్తకు ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కమ్యూనల్ పాలిటిక్స్ సిగ్గుచేటు. ఇదేనా మీ 'సబ్ కీ సాథ్ సబ్ కా వికాస్' అని అడుగుతున్నాను" అని అన్నారు.  ఈ వీడియోలో "అందరికీ నమస్కారం. నేను మంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న వేదవ్యాస్ కామత్ ధర్మపత్నిని. ఈ దఫా ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి నా భర్తను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన" అంటూ హిందూ మతాన్ని ప్రస్తావించినట్టు కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles