Actress Mamta Kulkarni’s properties seized నటి మమతాకు షాక్.. రూ.20 కోట్ల అస్తుల సీజ్..!

Actress mamta kulkarni s properties seized in drug haul case

mamta kulkarni drug racket, mamta kulkarni drug case, mamta kulkarni drug bust case, mamta kulkarni court case, mamta kulkarni properties, mamta kulkarni drug crime, Thane, Mamta Kulkarni, Solapur, Mumbai, Versova, Shishir Hirey,Shah Rukh Khan,salman khan,Saif Ali Khan,mamta kulkarni,Akshay Kumar,Aamir Khan

A special court designated under the Narcotics Drugs and Psychotropic Substances (NDPS) Act ordered the attachment of properties of former Bollywood actress, Mamta Kulkarni in drug haul case.

నటి మమతాకు షాక్.. రూ.20 కోట్ల అస్తుల సీజ్..!

Posted: 04/27/2018 11:26 AM IST
Actress mamta kulkarni s properties seized in drug haul case

బాలీవుడ్‌ అలనాటి అందాల నటి మమతా కుల్కర్ణికి థానేలోని న్యాయస్థానం షాకిచ్చింది. మాదక ద్రవ్యాల కేసుల నిందితురాలిగా తేలిన మమతా కుల్కర్ణి.. గత రెండేళ్లుగా పరారీలో వున్న నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న ‘ఎన్డీపీఎస్‌’ ప్రత్యేక న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. నటికి చెందిన సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని న్యాయస్థానం పోలీసులను అదేశించింది.

ముంబైలోని ప్రముఖ వాణిజ్యప్రాంతాలైన థానే, సోలాపూర్, వర్సోవాలలో వున్న ఈ మూడు ఫ్లాట్లను అటాచ్ చేయాలంటూ అదేశాలను జారీ చేసింది. 2016లో నటి మమతా కుల్కర్ణీపై థాణె పోలీసులు రూ.2000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసును నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఆమె న్యాయస్థానంలో విచారణకు గైర్హాజరవడంతో, ప్రత్యేక ఎన్డీపీఎస్‌ న్యాయస్థానం న్యాయమూర్తి హెచ్‌.ఎం.పట్వర్థన్ ఈమేరకు ఆదేశించారు.

మాదకద్రవ్యాల స్మగ్లరు వికీగోస్వామితో కలసి ప్రస్తుతం కెన్యాలో ఉంటున్న కుల్కర్ణిని మనదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు థానే పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు గతేడాది జూన్‌ 6న ఠాణె న్యాయస్థానం ప్రకటించింది. ఏప్రిల్‌ 2016లో మహారాష్ట్రలోని షోలాపుర్‌ జిల్లాలో గల అవన్‌ లైఫ్‌సైన్సెస్‌ లిమిటెడ్‌ ఆవరణలో నిల్వ ఉంచిన 18.5 టన్నుల బరువు గల ఎఫిడ్రైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2000 కోట్లు అని అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamta kulkarni  drug racket  court order  Thane  Solapur  Mumbai  Versova  crime  

Other Articles