Stalin, Opposition leaders court arrest on Cauvery issue కావేరీ జ్వాల: తమిళనాడు బంద్.. స్టాలిన్ అరెస్టు..

Cauvery issue oppn calls for tn shutdown dmk s stalin detained

Tamil Nadu shutdown, cauvery issue, cauvery management board formation, cauvery row, DMK calls for Tamil nadu shutdown, MK Stalin, Thirunavukkarasar, Thirumavalavan, K Balakrishnan, R Mutharasan, Prime Minister Narendra Modi, Supreme court, DMK, tamil nadu, politics

Opposition parties in Tamil Nadu, including DMK- is observing a statewide shutdown today to protest the BJP-led Centre’s failure to set up the Cauvery Management Board. DMK Working President MK Stalin, who was leading the protest from Chennai, was detained by the police.

కావేరీ జ్వాల: తమిళనాడు బంద్.. స్టాలిన్ అరెస్టు..

Posted: 04/05/2018 12:40 PM IST
Cauvery issue oppn calls for tn shutdown dmk s stalin detained

కావేరి నదీ జలాల వినియోగంపై మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో తమిళనాడులోని విపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు కొనసాగుతున్న బంద్ లో పలుచోట్ల అందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. డీఎంకే సహా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు ఇచ్చిన పిలుపుతో తమిళనాడు వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. నిరసనల్లో భాగంగా చెన్నైలోని బీచ్ రోడ్ కు భారీ ఎత్తున నిరసనకారులు చేరుకుని బంద్ ను విజయవంతం చేస్తన్నారు.

దేశ సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పులో ఆరు మాసాల్లోగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అదేశించింది. అయినా బోర్డు ఏర్పాటులో కేంద్రం అవలంభిస్తున్న తాత్సార వైఖరికి నిరసనగా ఓ వైపు అధికార అన్నాడీఎంకే కొనసాగించిన నిరాహారదీక్షలో పార్టీ నేతలు బిర్యానిని అరగించారన్న ఫోటోలు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా, ఇక విపక్షాలు తమిళనాడు బంద్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అన్నాశాలైలో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు.

స్టాలిన్ తో పాటు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునవక్కారుస్సార్, వీసికే అధినేత తిరుమావలవన్, సీపీఐ, సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శలు బాలకృష్ణన్, ముత్తారసన్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వెల్లూరులో 15 ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసులను రంగంలోకి దించారు. చెన్నైలో 15వేల మంది పోలీసులు మోహరించారు. దీంతో బంద్ కాస్తా హింసాత్మక రూపం దాల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles