“UIDAI may ask for DNA, blood, urine samples next”: SC ఆధార్ అనుసంధానంపై ‘సుప్రీం’ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

Possible dna tests for aadhaar could give excessive power to parliament sc

aadhaar, aadhaar DNA tests, DNA test, Supreme court, five-judge constitution bench, Chief Justice Dipak Misra, Justice A K Sikri, Justice A M Khanwilkar, Justice D Y Chandrachud, Justice Ashok Bhushan, aadhaar card fingerprints, Parliament, AG K K Venugopal, union government

The Supreme Court bench pointed out that the possibility of Aadhaar getting more biometric features like DNA would give excessive power to Parliament as the centre sasy it was not open to judicial review as it was a policy decision.

ఆధార్ అనుసంధానంపై ‘సుప్రీం’ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

Posted: 04/05/2018 01:36 PM IST
Possible dna tests for aadhaar could give excessive power to parliament sc

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పాన్ కార్డు, పాస్ బోర్డు, బ్యాంకు అకౌంట్లు సహా క్రమంగా అన్నింటీకీ ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయడంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై విచారిస్తున్న దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించి అటర్నీ జనరల్ కేకే వెణుగోపాల్.. ఆధార్ పథకాన్ని నిపుణులు అమోదించారని దీనిపై న్యాయ విచారణకు అదేశించడం విధాన నిర్ణయానికి వ్యతిరేకమని చెప్పాడంపై అత్యున్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

దీంతో ఆదార్ కార్డుల అనుసంధానంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విస్మయాన్ని వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో ఆధార్ బోర్డు ప్రజల రక్త నమూనాలను, డీఎన్ఏనూ, మూత్ర నమూనాలనూ సేకరిస్తామని కూడా చెబుతుందేమోనని వ్యాఖ్యానించింది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖాన్ విల్కార్, జస్టిస్ డీవీ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించరాదన్న అటార్నీ జనరల్ వ్యాఖలపై డీఎన్ఏ టెస్టు, మలమూత్రాల పరీక్షలు కూడా నిర్వహిస్తే పార్లమెంటుకు మరింత అధికారం కూడా చేకూరునట్టు అవుతుందని ధర్మాసనం వ్యంగ్యవ్యాఖ్యలు చేసింది.

దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన వున్నవారికి ప్రవేశపెట్టే పథకాలు సద్వనియోగం కావాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యమని, వారిని అదుకుని వారికోసమే సంక్షేమ పథకాలను అందించాలన్నది.. పథకాలు అర్హులకు చేరాలన్నదే ప్రభుత్వ అభిమతమని అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. అయితే న్యాయస్థానాలు ఆధార్ విషయంలో కల్పించుకోవద్దని కూడా ఆయన వాదించారు. అయితే ఆధార్ నిర్ణయం పారదర్శకతతో కూడినదా? నిజాయితీతో ఉన్నదా? అన్న అన్న విషయాలను మాత్రమే కోర్టు విచారించగలుగుతుందని చెప్పారు.

దీనితో ఏకీభవించని న్యాయస్థానం ఆధార్ కార్డును వ్యతిరేకిస్తూ తమను ఆశ్రయించిన వారి పరిస్థితి ఏంటని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం వేలిముద్రలు, కనుపాపలు సేకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టా? కాదా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని, భవిష్యత్తులో ఆధార్ బోర్డు రక్తం, మూత్రం, డీఎన్ఏ నమూనాలను కోరదన్న నమ్మకం ఏంటని ప్రశ్నించింది. పలు రకాల సంక్షేమ పథకాల్లో నిజమైన లబ్దిదారుల ఎంపికకు ఆధార్ ఎంతో ఉపకరిస్తోందని వేణుగోపాల్ వాదించారు. కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aadhaar  aadhaar DNA tests  DNA test  Supreme court  aadhaar card fingerprints  Parliament  

Other Articles