New Rules on Tatkal Ticket Issued by Indian Railways తత్కాల్ టిక్కెట్లలో కొత్త నిబంధనలు ఇవే..

Check out new rules on tatkal ticket issued by indian railways

Indian Railway Catering and Tourism Corporation, indian railways, IRCTC, Tatkal tickets, new rules, AC coches, NON AC coches, non ac ticket bookings

The Indian Railway Catering and Tourism Corporation (IRCTC) has introduced new rules for booking Tatkal tickets. These are booked by the passengers who have to travel on an urgent basis.

తత్కాల్ టిక్కెట్లలో.. ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు ఇవే..

Posted: 04/05/2018 12:06 PM IST
Check out new rules on tatkal ticket issued by indian railways

తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుని రైలులో ప్రయాణించాలనుకుంటున్నారా..? అయితే తాజాగా ఐఆర్సీటీసీ వారు జారీ చేసిన కొత్త నిబంధనలను మీరు ఒక్కసారి చదవాల్సిందే. ఎందుకంటే గతంలో మాదిరిగా కాకుండా రైలులోని ఏసీ కోచ్, ఏసీ తరగతి కోచ్ టిక్కెట్లను ఓ సమయానికి ప్రారంభించడంతో పాటు నాన్ ఏసీ టిక్కెట్ల బుకింగ్ ను మరో సమయానికి ప్రారంభించనుంది. దీంతో తొలుత ప్రారంభమయ్యే ఏసీ టిక్కట్ల బుకింగ్ లోనైనా కనీసం టిక్కెట్ లభిస్తే చాలునని ప్రయాణికులు అలోచించి.. అటుగా వెళ్లడం ద్వారా రైల్వే అదనపు అదాయాన్ని అర్జిస్తుంది.

ఒకప్పుడు దేశంలోని అనేక మంది పేద, బడుగు, మధ్య తరగతి ప్రయాణికులను అత్యంత చౌకైన ధరల్లో సుదూర ప్రాంతాలైన వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు భారత రైల్వే దోహదపడింది. మారుతున్న కాలానికి అనుగూణంగా, పాలకులు నిర్ణయాల మేరకు భారతీయ రైల్వే కూడా లాభాలను అర్జించే విధానాన్ని ఎంచుకుంది. పేద, బడుగు ప్రజల సేవలను విస్మరించి.. కేవలం అదాయ వనరులను పెంచుకునేందుకు మాత్రమే అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అడ్వాస్ బుక్కింగ్ టిక్కెట్ల విధానంలోనూ మార్పులు చేసిన కేంద్ర రైల్వే శాఖ.. తాజాగా తత్కాల్‌ టికెట్ల బుకింగ్ కు ఐఆర్‌సీటీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. అవేంటంటే..

*    ఏసీ తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్‌-ఏసీ టికెట్ల బుకింగ్‌ 11 గంటలకు ప్రారంభిస్తారు.
*    తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు.
*    ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్‌-దిగాల్సిన స్టేషన్‌ లేదా రెండూ ఆ మార్గంలో లేకపోయినా.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని     రద్దు చేసుకుని చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరవచ్చు.
*    బుక్‌ చేసుకున్న క్లాసులో కాకుండా దిగువ తరగతి శ్రేణిలో ప్రయాణించాలని రైల్వే వర్గాలు కోరితే.. ఇష్టం లేని ప్రయాణికులు పూర్తి రిఫండ్‌ కోరవచ్చు. ప్రయాణికులు అందుకు అంగీకరిస్తే.. చార్జీల మధ్య తేడాను     ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian railways  IRCTC  Tatkal tickets  new rules  AC coches  NON AC coches  non ac ticket bookings  

Other Articles