ISRO successfully launches GSAT-6A satellite నిప్పులు చిమ్ముతూ నింగిలోకి.. విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి

Gsat 6a communication satellite put into orbit pm modi congratulates isro

GSAT-6A launch, GSAT-6A, ISRO communication satellite, ISRO, Sriharikota, GSLV rocket, GSLV-F08, Indian Space Research Organisation

The Indian Space Research Organisation (ISRO) has successfully launched its high power S-band communication satellite GSAT-6A using its heavy rocket Geosynchronous Satellite Launch Vehicle (GSLV-F08).

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి.. విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి

Posted: 03/29/2018 05:46 PM IST
Gsat 6a communication satellite put into orbit pm modi congratulates isro

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-6ఏ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌08 రాకెట్.. సరిగ్గా ఇవాళ సాయంత్రం 4.56 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 17 నిమిషాల 46 సెకన్ల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. ఎస్‌ బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో.. 2015 ఆగష్టులో ఇస్రో జీశాట్‌-6ను ప్రయోగించిన తరువాత మళ్లీ దాదాపుగా మూడేళ్ల తరువాత జీశాట్‌-6ఏ రెండవ‌ సారి ఇక్రో నింగిలోకి పంపింది.

జీశాట్-6ఏ ఉపగ్రహాల ద్వారా నడిచే మొబైల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థకు మరింత బలం చేకూర్చుతుంది. ఇందుకోసం ఇస్రోకి రూ. 270 కోట్లు ఖర్చు అయింది. ఈ ఉపగ్రహంలో ఇస్రో ప్రత్యేకమైన యాంటెనాను అమర్చింది. ఇస్రో చేసిన ప్రయోగాల్లో వినియోగించిన యాంటెనాలకు ఇది విభిన్నమైంది. మిలటరీ అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇస్రో ఛైర్మన్‌ కే శివన్ ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. జీశాట్-6ఏ ఉపగ్రహం జీశాట్-6ను పోలి ఉంటుందని, అయితే ఇందులో కొన్ని మార్పులు చేశామని ఇస్రో అధికారులు చెప్పారు. ఇక ఈ ప్రయోగంలో రాకెట్ రెండో దశలో అధిక విస్పోటనం కలిగిన వికాస్ ఇంజిన్, ఎలక్ట్రోమెకానికల్ ఆక్టేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇస్రోవేత్త‌లు, కుటుంబ స‌భ్యుల‌కు అభినంద‌ల‌ని ఇస్రో ఛైర్మ‌న్ కే శివ‌న్ అన్నారు. ఈ రోజు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-6ఏ ప్రయోగం విజయవంతమైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కే శివ‌న్ మాట్లాడుతూ... ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తాము 9 నెలల్లో 10 మిషన్లకు ప్రణాళిక వేశామని, అలాగే ఈ ఏడాది చంద్రయాన్‌-2 ఉందని పేర్కొన్నారు. కాగా, జీశాట్‌-6ఏ.. మల్టీబీమ్‌ కవరేజ్‌ ద్వారా దేశ వ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్‌కు ఉపయోగపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISRO  communication satellite  GSAT-6A  Indian Space Research Organisation  GSLV-F08  

Other Articles