pawan kalyan writes to AP government on guntur hepatitis ప్రభుత్వానికి పవన్ లేఖ.. హెపటైటిస్ విస్తరిస్తుందని అందోళన

Pawan kalyan writes to ap government on guntur hepatitis

pawan kalyan, janasena, guntur, AP Government, chandrababu, guntur, hepatitis, epidemic, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan writes to AP government on hepatitis virus. Asks the government to take necessary steps to aviod epidemic in the locality.

ప్రభుత్వానికి పవన్ లేఖ.. హెపటైటిస్ విస్తరిస్తుందని అందోళన

Posted: 03/29/2018 06:47 PM IST
Pawan kalyan writes to ap government on guntur hepatitis

రాష్ట్రంలోని పాలకులు ఇటు ప్రజారోగ్యం వైపు కూడా దృష్టి సారించాలంటూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన కల్యాన్ పేర్కోన్నారు. గుంటూరు జిల్లాలో ఆందోళనకర స్థాయిలో వైరల్ హెపటైటిస్ విస్తరిస్తోందని తక్షణం చర్యలు చేపట్టాలని ఏపీ సర్కారుని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేస్తూ... "రెండు వారాల క్రితం గుంటూరులో డయేరియా 23 మందికి పైగా పొట్టన పెట్టుకోగా ఇప్పుడు వైరల్ హెపటైటిస్ ముగ్గుర్ని బలితీసుకుంది. రామిరెడ్డి తోట ప్రాంతంలో ఈ మహమ్మారి ప్రబలింది. చనిపోయిన వారిలో ఒక బాలింత, రోజుల శిశువు, మరో మహిళ ఉన్నారు. ఈ మరణాలకు కూడా కలుషిత నీరే కారణమని డాక్టర్లు చెబుతున్నారు.

రామిరెడ్డి తోటతోపాటు ప్రకాష్ నగర్, గుంటూరువారి తోట ప్రాంతాలలో మరో 180 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి ప్రబలిన ప్రాంతాలలో డయేరియా వ్యాధి పై మోనిటరింగ్ చేయడానికి జనసేన ఏర్పాటు చేసిన బృందం ఈ రోజు వ్యాధి పీడిత ప్రాంతాలలో పర్యటించి వివరాలు సేకరించడంతో పాటు వీడియోను కుడా చిత్రీకరించి బాధిత ప్రాంతాల వారితో మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన సైనికులు ఈ ప్రాంతాలలో ఇంటింటికీ పర్యటించి భాధితులను పరామర్శించి వ్యాధి వ్యాప్తి చెందటానికి గల కారణాలను సేకరించారు.

ఈ వ్యాధి సోకి చనిపోయిన బాలింత సాధులక్ష్మీ, లావణ్య (22) కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. జనసేన శ్రేణులు సేకరించిన వివరాల మేరకు నెల రోజులుగా ఈ ప్రాంతాలలో తాగునీరు, డ్రెయినేజీ లో కలవటం వల్ల కామెర్ల వ్యాధి వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. ఆ నీరు తాగిన వారందరూ తీవ్రమైన వాంతులు విరేచనాలు, కామెర్లతో బాధపడుతున్నారు. ఈ వివరాలను అధికారులకు కుడా మోనటరింగ్ సభ్యులు అందచేయనున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కలుషిత నీరు సరఫరా కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నాను" అని పవన్ కల్యాణ్ అందులో పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  guntur  AP Government  chandrababu  guntur  hepatitis  epidemic  andhra pradesh  politics  

Other Articles