BJP has set state ablaze, Nitish is finished says lalu yadav ఆయన పని ఫినిష్ అంటూ లాలూ సంచలన వ్యాఖ్యలు..

Bjp has set bihar ablaze nitish kumar is finished says lalu prasad yadav

Nitish kumar, Lalu Prasad Yadav, communal incidents, Samastipur violence, Aurangabad violence, Bihar, Bhagalpur, PM Modi, politics

RJD supremo Lalu Prasad Yadav lashed out at the Nitish Kumar government over incidents of violence in different parts of the state. Speaking to reporters upon his arrival in the national capital for medical treatment, Lalu said that 'Nitish Kumar is moving towards his end'.

ఆక్రోశాన్ని వెల్లగక్కిన లాలూ.. ఆయన పని ఫినిష్ అంటూ వ్యాఖ్యలు..

Posted: 03/29/2018 05:03 PM IST
Bjp has set bihar ablaze nitish kumar is finished says lalu prasad yadav

తమ మహాకూటమి అధికారంలో వున్నప్పుడు.. రాష్ట్రంలో ఎలాంటి అలజడులు లేకుండా సవ్యంగా పాలన సాగిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కూడా అదుపులో వున్నాయని.. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అయితే తమ కూటమి సవ్యంగా సాగడాన్ని జీర్ణించుకోలేని బీజేపి కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నందన విచ్ఛిన్నం చేసి.. నితీష్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక కుట్ర వుందని, అప్పుడు చెప్పినా నితీష్ వినిపించుకోలేదని అన్నారు. అయితే అదును చూసిన బీజేపి తమ కుట్రను ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగిస్తుందని అరోపించారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పని ఇక ముగిసిందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆయన అక్కడి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కొద్దిసేపు మాట్లాడారు. ‘‘బీహార్ మొత్తం అల్లర్లు, హింసతో అట్టుడుకుతోంది. నన్ను నిర్బంధంలోకి పంపిన తర్వాత, రాష్ట్రాన్ని మొత్తం బీజేపీ రావణకాష్ఠంగా మార్చేసింది. ఇక నితీశ్ పని అయిపోయింది...’’ అని లాలూ పేర్కొన్నారు. దాణా కుంభకోణం కేసుల్లో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం లాలూ ఆరోగ్యం ఇటీవల తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
 
ఈ నెల 17న బీహార్ లోని భాగల్పూర్ లో మత ఘర్షణలు చోటుచేసుకున్న తరువాత సమస్తీపూర్, ఔరంగబాద్ లలో కూడా మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో లాలూ దీనిపై స్పందించారు. కేంద్రమంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శాశ్వత్ నాయకత్వంలో బీజేపీ, ఆరెస్సెస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు నిర్వహించిన ఓ ఊరేగింపు సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. హింసను రెచ్చగొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శాశ్వత్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ... అరెస్టు చేయడంలో జాప్యం జరగడంపై ప్రతిపక్షాలు నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles