భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఉన్న 'నమో' యాప్ మీ మొబైల్ లో వుందా..? అయితే మీకు సంబంధించిన వ్యక్తిగత డేటా ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా చేతిలోకి వెళ్లిపోయింది. అనుమానంగా వుందా..? కానీ ఇదే నిజమని సంచలన ఆరోపణలు చేసిన ఫ్రెంచ్ హ్యాకర్ ఇలియట్ అల్డర్ సన్, తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెడుతూ, ఈ యాప్ యూజర్ల నుంచి అనుమతి తీసుకోకుండా వారి చిరునామాను అమెరికాకు చెందిన వెబ్ సైట్ కు అందిస్తోందని ఆరోపించారు. ఏపీఐ డాట్ నరేంద్ర మోదీ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ కు సమాచారం వెళుతోందని చెప్పారు.
ఈ యాప్ గూగుల్ ప్లే ప్రమాణాలను ఉల్లంఘిస్తోందని, యూరప్ రెగ్యులేటరీ జీడీపీఆర్ ప్రమాణాలను పాటించడం లేదని అన్నారు. యూజర్ అనుమతి లేకుండా సమాచారాన్ని తీసుకోరాదన్న నిబంధనలు ఉన్నా, ఈ యాప్ దాన్ని పాటించడం లేదని అన్నారు. గూగుల్ ప్లే డెవలపర్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాన్ని 'నమో' యాప్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. యాప్ పై ఇలియట్ అల్డర్ సన్ తాజా ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. నమో యాప్ వేసుకున్న అభిమానులు కూడా అందోళనకు గురవుతున్నారు. తాము అభిమానంతో యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే.. ఏకంగా తమకు వ్యక్తిగత డేటాను తస్కరించే చర్యలకు ఈ యాప్ పాల్పడుతుందన్న విషయం తెలిసి.. అందోళనకు గురవుతున్నారు.
కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల సమాచారాన్ని ప్రజలతో ఎప్పటికప్పుడు పంచుకునేందుకు వీలుగా, ఇక కేంద్రం ఏం చేస్తుందన్న విషయాన్ని యాప్ వినియోగాదారులకు నిత్యమూ తెలియజేసే ఉద్దేశంతో 2015 జూన్ లో 'నమో' యాప్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆపై సందర్భం వచ్చిన ప్రతిసారీ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గూగుల్ ప్లే నుంచి 50 లక్షల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఈ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగలిస్తున్నారని అరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
నమో యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తరువాత దాన్ని ఇన్ స్టాల్ చేస్తే, ఎన్నో రకాల అనుమతులను అడుగుతోంది. సాధారణంగా ఏ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నా, మెసేజ్ లు, కాంటాక్ట్ లిస్ట్ తదితరాలను యాక్సెస్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. నమో యాప్ ఏకంగా 22 అంశాల్లో పర్మిషన్ అడుగుతుండటం గమనార్హం. యూజర్ ఉండే లోకేషన్, అతని సెల్ ఫోన్ మెమొరీలోని ఫొటోలు, కాంటాక్ట్స్, కెమెరా, మైక్రోఫోన్ వంటి సమస్త అంశాలపైనా యాక్సెస్ తీసుకుంటుంది. స్మార్ట్ ఫోన్ మెమొరీ కార్డులో ఉన్న సమాచారంపైనా అనుమతి అడుగుతుండటం గమనార్హం.
'నమో' యాప్ ఇన్ స్టాల్ సమయంలో అన్ని అనుమతులు ఇవ్వడం తప్పనిసరేమీ కాదని కొందరు చెబుతున్నా, అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఫోన్ లోని డేటా మొత్తాన్ని పరిశీలించే అవకాశం దానికి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో యూత్ ఆలోచన ఏ దిశగా ఉంది? వారేమి కోరుతున్నారు? తదుపరి ఎన్నికల్లో విజయానికి ఎటువంటి ఎత్తులు వేయాలన్న విషయాలను ఈ యాప్ అందించే సమాచారం ద్వారా నరేంద్ర మోదీ విశ్లేషిస్తున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more