Lok Sabha fails to take up no-confidence motion లోక్ సభలో రసాభస.. విపక్షనేతపైకి దాడికి యత్నం..

Ls adjourned till wednesday ruckus between congress and aiadmk members

Lok Sabha, Government of India, Parliament of India, Mahajan, Motion of no confidence, Adjournment, Speaker of the Lok Sabha, Sumitra Mahajan, Cauvery river, Ananth Kumar, Congress, AIADMK, Speaker, Mallikarjun Kharge, politics

The Lok Sabha today failed to take up again notices for no-confidence motion against the government after Speaker Sumitra Mahajan said the House was not in order and adjourned proceedings amid noisy protests over various issues.

లోక్ సభలో రసాభస.. విపక్షనేతపైకి దాడికి యత్నం..

Posted: 03/27/2018 12:40 PM IST
Ls adjourned till wednesday ruckus between congress and aiadmk members

పార్లమెంటు ఇవాళ అసాధారణ పరిస్థితిని చవిచూసింది. ఓ జాతీయ పార్టీకి చెందిన లోక్ సభా పక్ష నేతపై దాడికి ఓ రాష్ట్రస్థాయి పార్టీ నేతలు యత్నించడం.. ఇప్పటివరకు ఎన్నడూ లేని పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి. అయితే సమాయానికి అక్కడకు చేరుకున్న మార్షల్స్ ఇరు పార్టీ సభ్యులకు సర్థిచెప్పారు. ఇదే సమయంలో జాతీయ పార్టీ అధినేత్రి పగ్గాలను ఇటీవలే వదిలిన నేత.. వారించడంతో రాష్ట్రానికి చెందిన పార్టీ సభ్యులు వెనక్కు తగ్గారు. దీంతో లోక్ సభ రెండో పర్యాయం వాయిదా పడిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొంది.

లోక్ సభలో అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, సీపీఎం సహా పలు పార్టీలు.. వాటిపై చర్చించాలని డిమాండ్ చేశాయి. అయితే తొలుత లోక్ సభ ప్రారంభం కాగానే రెండు నిమిషాల పాటు కూడా సాగకుండానే అన్నాడీఎంకే సభ్యులు చేస్తున్న అందోళన నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ గంట పాటు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైన సభలో అన్నాడీఎంకే సభ్యుల నినాదాల మధ్యనే స్పీకర్ ప్రశోత్తరాలను కొనసాగించారు. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే పట్టుబట్టారు.

దీనికి బదులిస్తూ బీజేపి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తమ ప్రభుత్వం అవిశ్వాసంపై సిద్దంగా వుందని అన్నారు. ఇటు సభలోనూ సభ్యుల విశ్వాసం తమకుందని, ఇక బయట దేశప్రజల విశ్వాసం కూడ వుందని, చివరకు అవిశ్వాసంపై చర్చకు కూడా తమపైనే సభలోని సభ్యులందరికీ విశ్వాసముందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ మూడింటిలోనే కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా వుందని, కేంద్ర ప్రభుత్వంపై అబద్దాలు చెబుతూ.. వాటినే లోక్సభలోనూ వల్లెవేయడానికి అవిశ్వాసం పెట్టారని విమర్శించిన ఆయన కనీసం అవిశ్వాసం పెట్టేందుకు బలం కూడా లేని మార్జినల్ పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోయిందని కూడా దుయ్యబట్టారు.

ఈ క్రమంలోనే తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. కావేరీ నదీ జలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో అవిశ్వాసంపై ప్రకటనను స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో చదివి వినిపించారు. అయితే సభలోని సభ్యులందరూ తమతమ స్థానాల్లోకి వెళ్తే తప్ప అవిశ్వాసంపై చర్చ జరగదని.. హౌజ్ అర్డర్ లో లేకుండా అవిశ్వాసంపై ఎలా చర్చ కొనసాగుతుందని అమె సభ్యులను కోరారు. అయినా అన్నాడీఎంకే సభ్యులు మాత్రం స్పీకర్ మాటలను లక్ష్యపెట్టకుండా వెల్ లోకి దూసుకువచ్చి మరీ అందోళన చేశారు.

ఈ క్రమంలోనే అన్నాడీఎంకే ఎంపీలు అవిశ్వాసం తీర్మానం చర్చకి రాకుండా అడ్డుకుంటున్నారని.. బీజేపీకి తొత్తుగా మారారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహంగా ఊగిపోయిన అన్నాడీఎంకే ఎంపీలు పీఆర్ సుందరం, అరని ఎళుమలై కాంగ్రెస్ ఎంపీలపైకి దూసుకెళ్లారు. ఈ సమయంలో ఖర్గే కూడా స్పందించారు. అందోళన చేస్తున్న సభ్యులపై చర్యలు తీసుకుని సభను సజావుగా నడిపించాలని కోరారు. దీంతో ఖార్గేపై కూడా సభ్యులు దూసుకెళ్లారు. సభ వాయిదా పడిన తర్వాత కూడా కాంగ్రెస్ – అన్నాడీఎంకే ఎంపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. సభ జరిగినన్ని రోజులూ నోటీస్ ఇస్తూనే ఉంటాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎంపీలు ప్రకటించారు.అయితే సమయానికి మార్షల్స్ అడ్డుకోవడంతో పాటు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అన్నాడీఎంకే సభ్యులను వారించడంతో వారు వెళ్లిపోయారు.  

ఆ తరువాత బయటకు వచ్చిన కాంగ్రెస్ లోకసభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే మీడియాతో మాట్లాడుతూ.. సభలో తమకు సంఖ్యాబలం వుందని, బయట ప్రజాబలం వుందని.. అవిశ్వాసంపై చర్చకు తాము సిద్దమని ప్రకటిస్తున్న బీజేపి.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే సభలో అవిశ్వాసంపై చర్చ జరగకుండా అన్నాడీఎంకే ఎంపీలతో కలసి డ్రామాను నడిపిస్తుందని దుయ్యబట్టారు. సభలో ప్రభుత్వానికి కావాల్సిన కీలక ఫైళ్లకు అమోదం తెలుపుతున్న క్రమంలో అవిశ్వాసంపై చర్చ ఎందుకు జరగదని ఆయన ప్రశ్నించారు.

అందోళన చేస్తున్న సభ్యులపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ ఇంకా ఎన్నిరోజులు వేచిచూస్తారని ఆయన ప్రశ్నించారు. ఇవాళ స్పీకర్ చాంబర్ లోకి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు గడ్కారీ సహా ఏడు నుంచి ఎనమిది మంది వెళ్లారని, అ తరువాత స్పీకర్ సభకు వచ్చి రాగానే వాయిదాలను వేస్తున్నారని ఆయన అరోపించారు. అయితే వీరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయన్నది మాత్రం తనకు తెలియదని ఖార్గే అరోపించారు. నోటీస్ ప్రకారం సభ్యుల మద్దతు ఉందని.. వెంటనే చర్చ ప్రారంభించాలని పదేపదే కోరారు. కొందరు సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని.. అధికార పార్టీ కావాలనే ఇలా చేస్తుందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles