Karnataka to vote on May 12, result May 15 కర్ణాటక అసెంబ్లీకి మోగిన నగరా.. 12న ఎన్నికలు.. 15న కౌంటింగ్..

Karnataka to vote on may 12 result may 15

Karnataka Assembly elections, Karnataka elections, Karnataka Election 2018, BJP, Congress, BS Yeddyurappa, Siddaramaiah, Election Commission, Election Commission of India, EC, ECI

Karnataka will go to polls on May 12. The election will be held in single phase. Counting of votes will be held on May 15. The Model Code of Conduct comes into force immediately, the Election Commission of India said.

కర్ణాటక అసెంబ్లీకి మోగిన నగరా.. 12న ఎన్నికలు.. 15న కౌంటింగ్..

Posted: 03/27/2018 11:19 AM IST
Karnataka to vote on may 12 result may 15

దక్షిణాదిలో తమ పార్టీ నేతల అవినీతి, అక్రమార్జనలు, నాయకత్వ లోపంతో, నాయకుల మధ్య విభేధాలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కూడా చేజారడంతో.. మళ్లీ అదే రాష్ట్రంలో పాగా వేయాలని శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నా ఎన్నికల సర్వేలు మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలను వెల్లడిస్తున్న నేపథ్యంలో ఏం చేద్దమని యోచనలో పడిన బీజేపీకి ఇప్పుడా అవకాశం కూడా పరిమితే అయ్యింది. మే 28వ తేదీతో కర్ణాటకలోని ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో తక్షణం కార్ణటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ముందే లీక్ కావడంపై కొంత వివాదం కూడా నెలకొంది.

ఇక ఎన్నికల వివరాల్లోకి వెళ్తే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను మే 12వ తేదీన నిర్వహిస్తుండగా, 15న ఎన్నికల కౌంటింగ్ చేపట్టి ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. మొత్తం 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుపుతున్నట్టు పేర్కొంది. ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీపాట్ మెషీన్లను కూడా వినియోగించనున్నట్టు తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటోలను కూడా ఈవీఎంలకు జత చేస్తున్నామని... దీనివల్ల ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురికాకుండా ఉంటారని వెల్లడించింది. పోలింగ్ బూత్ లలో మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని... 450 పోలింగ్ స్టేషన్లను మొత్తం మహిళలే నిర్వహిస్తారని చెప్పింది. ఎన్నికల కోడ్ రాష్ట్రానికే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది.

గత ఎన్నికల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తామని ఈసీ తెలిపింది. తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకునేలా... బలహీనవర్గాల ఓటర్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పింది. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుకు సంబంధించి రూ. 28 లక్షలకు సీలింగ్ విధిస్తున్నామని తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 4.96 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 2 కోట్ల, 51 లక్షల 79 వేల 219 మంది పురుష ఓటర్లు ఉండగా, 2 కోట్లచ 44 లక్షల 76 వేల 840 మంది మహిళా ఓటర్లు వున్నారని ఈసీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly elections  Karnataka  BJP  Congress  BS Yeddyurappa  Siddaramaiah  Election Commission  

Other Articles