AirAsia is offering cheap flights to Bangkok, Melbourne at Rs. 1999 ఎయిర్ ఏషియా సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్..

Airasia offer domestic flight tickets to start from rs 850

AirAsia, AirAsia offers, AirAsia flights, flight ticket discounts, flight ticket offers, international flights, flight ticket prices, Jaipur, Bengaluru, hyderabad, kolkata, summer, discount offer, aviation, airlines, aviation

AirAsia today announced fares as low as Rs 850 to domestic destinations and Rs 1,999 to international destinations, if tickets are booked from its website or mobile app between March 26 and April 1.

ఎయిర్ ఏషియా సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్.. దేశీయం.. విదేశీయానంలోనూ..

Posted: 03/26/2018 12:52 PM IST
Airasia offer domestic flight tickets to start from rs 850

విమానయాన రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో అన్ని విమానయాన సంస్థలు డిస్కౌంట్ లు ప్రకటించి.. సీటు అక్యూపెన్నీని పెంచేకోవడం, నష్ట నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి. ఇక తాజాగా వేసవి రావడంతో. ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ తమ కస్టమర్లను అకర్షించే చర్యలు చేసింది. కస్టమర్లను తమ వైపు అకర్షించేలా భారీ తగ్గింపు ధరలతో డిస్కౌంట్ ఆపర్లను ప్రకటించింది. కేవలం రూ.849తో దేశీయంగా ప్రయాణ టికెట్టును బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

అలాగే, అంతర్జాతీయ రూట్లలో రూ.1,999కే టికెట్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 1 వరకు టికెట్లపై ఈ డిస్కౌంట్ ధరకు అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మే 28లోపు ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చునని కూడా ప్రకటించింది. అయితే ఈ తగ్గింపు ఒకవైపు ప్రయాణానికి మాత్రమే వర్తించనుందని, తిరుగు ప్రయాణానికి ఈ డిస్కౌంట్ ఆఫర్ లభించదని స్పష్టంగా వెల్లడించింది విమానయాన సంస్థ.

అంతర్జాతీయంగా కౌలాలంపూర్, బ్యాంకాక్, ఫుకెట్, అస్ట్రేలియా మెల్ బోర్న్ ప్రాంతాలకు అత్యంత తక్కువ ధరకు విదేశీయానం అవకాశాన్ని కల్పిస్తుంది. కేవలం రూ. 1999 లకే ఈ దేశాలకు చేరుకునే అవకాశాన్ని కల్పించనుంది. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం పూర్తి టికెట్ ధరను వెచ్చించాల్సి వస్తుంది. ఇక ఇటు దేశీయంగా బెంగళూరు, రాంచి, జైపూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, నాగ్ పూర్, ఇండోర్, కోచ్చి, హైదరాబాద్, ఫూణే, గౌహతి, చెన్నై, కొల్ కతా ప్రాంతాల మధ్య మార్గాల్లో రూ.849 ధరకే టికెట్లను అందిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  Jaipur  Bengaluru  hyderabad  kolkata  domestic  international  summer  discount offer  aviation  

Other Articles