pawan kalyan, left parties to start statewide protest on status రాష్ట్రస్థాయి ఉద్యమాలకు నడుం చుడుతున్న జనసేన, వామపక్షాలు

Pawan kalyan question tdp bjp over special status says will tieup with left and start agitation

pawan kalyan, janasena, guntur, mangalagiri, cpi, cpm, madhu, rama krishna, left parties, security, gunmans, private security, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan question TDP, BJP over special status, who defered with jana sena while he was questioning ruling parties, says will tieup with left and start state side protest on the same

రాష్ట్రస్థాయి ఉద్యమాలకు నడుం చుడుతున్న జనసేన, వామపక్షాలు

Posted: 03/26/2018 02:05 PM IST
Pawan kalyan question tdp bjp over special status says will tieup with left and start agitation

ప్రత్యేక హోదా అవసరం లేదు అని చెప్పిన వాళ్లు ఇవాళ అదే ప్రత్యేక హోదా కోసం ఏదో భగీరధ ప్రయత్నం చేస్తున్నట్లుగా అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలోని ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపి కూడా నామ్ కే వాస్తే పోరాటాలు చేసిందే తప్ప.. చిత్తశుద్దితో హోదా కోసం పోరాడింది మాత్రం లేదని ఆయన విమర్శించారు. ఏడాది కాలం జరిగిన తరువాత తాను టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో అడగకుండా ఏం చేస్తున్నారని.. ఎంపీలుగా రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారని, స్వప్రయోజనాలు, వ్యాపారాలను అపి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని తాను నిలదీశానని అన్నారు పవన్.

అప్పుడు తనతో చర్చించిన ప్రభుత్వ తరపు వర్గాలు.. తొలి సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు జరిగిన తరువాత చూద్దమని, అప్పుడే వద్దని అన్నారని అలా.. ఒకటి, రెండు సంవత్సరాలు గడిచిన తరువాత.. 2016లో తిరుపతి సభలో అడిగితే ప్రత్యేక హోదా అవసరం లేదని అన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆ తరువాతు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని.. వాదించింది ఎవరు..? కాకినాడ సభకు ముందు అర్థరాత్రి హైడ్రామాలో భాగంగా ప్యాకేజీ ప్రకటించి.. దాని బేష్ హోదాతో కూడా సాధ్యం కాని అవసరాలు ప్యాకేజీతో తీరుతాయని అన్నది ఎవరని ప్రశ్నించారు. అయితే ప్యాకేజీకి చట్టబద్దత లేదని తాము ప్రశ్నిస్తే తమ అది కూడా త్వరగానే చేస్తామని చెప్పింది ఎవరని కూడా పవన్ ప్రశ్నించారు.

ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరగాల్సిన అంశాన్ని కేంద్రంతో సంబంధం లేని వ్యక్తులు, కేవలం పార్టీతో సంబంధమున్న వ్యక్తులు మాత్రమే చెబితే వాటిపై ఎలా స్పందిస్తామని, అసలు ఆయనను ఏ హోదాలో ఈ లేఖ రాశారని పరిగణించాల్సిన అవసరం వుందని పవన్ కల్యాన్ అన్నారు. ఇక రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ఉత్తరాంధ్రలో పుట్టిన బిడ్డలు చనిపోతున్నా.. పట్టించుకోలేదని అరోపించారు. అయితే వేల కోట్ల ప్రజాధనాన్ని పుష్కరాలకు ఖర్చుచేయడమేంటని పవన్ కల్యాన్ ప్రశ్నించారు.

రైతులు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం కనీసం వారికి అండగా వుంటామన్న భరోసాను కూడా కల్పించలేకపోయిందని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారన్నారు. రాజధాని నిర్మాణం.. సహా అన్ని అంశాల్లో టీడీపీ వైఫల్యం చెందిందని పవన్ కల్యాన్ విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం అందులో ఎవరెవరకి ఎక్కడ అన్న కేటాయింపులు కూడా ఇప్పటికీ చేయలేదని అన్నారు. ఇక నాలుగేళ్ల పాటు బీజేపి అన్ని రకాలుగా సహకరించిన టీడీపీ.. ఇప్పుడు తామే పోరాటం చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతుందని, ప్రత్యేక హోదాతో లాభమే లేదన్నవాళ్లు.. ఇప్పుడెందుకు దాని కోసం తాము పోరాటం చేస్తున్నామని అసెంబ్లీలో ప్రగల్భాలు పలుకుతున్నారని పవన్ కల్యాన్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  cpi  cpm  madhu  rama krishna  left parties  andhra pradesh  politics  

Other Articles