Centre bows to AP pressure టీడీపీ ఎంపీల అందోళనకు దిగవచ్చిన కేంద్రం..

Centre bows to ap pressure agrees to bridge revenue deficit in full

Arun Jaitley, finance minister, Piyush Goel, railway minister, Sujana Chowdary, union minister, 2018 budget, special status, special package, Andhra Pradesh

Union Ministers Arun Jaitley, Piyush Goel, Sujana Chowdary and BJP chief Amit Shah, who met late on Friday, went over the demands of the AP government and agreed to bridge the revenue deficit in full, the state had inherited at the time of bifurcation.

టీడీపీ ఎంపీల అందోళనకు దిగివచ్చిన కేంద్రం..

Posted: 02/10/2018 09:26 AM IST
Centre bows to ap pressure agrees to bridge revenue deficit in full

కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంద్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు గత పది రోజులుగా పార్లమెంటు ఉభయసభలను స్థంభింపజేసేలా చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రం ఎట్టకేలకు రాష్ట్రానికి కొన్ని నిధులను విధిల్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నిధుల లేమితో సతమతం అవుతన్న నవ్యాంధ్రకు న్యాయం చేయాల్సిన కేంద్రం వార్షిక బడ్జెట్ లో రాష్ట్రాన్ని అసలు పట్టించుకోలేదని నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలో ఎంపీలను శాంతింపజేసేందుకు ఎట్టకేలకు కేంద్రం అర్థిక సంఘం కింధ నిధులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంటులోని సమావేశాలు ముగిసిన అనంతరం ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సందర్భంగా ప్రధాని మోదీ నుంచి కానీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి కానీ తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక ప్రకటన వెలువడలేదు. ముఖ్యంగా బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు బడ్జెట్ సమావేశాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.

అయితే, సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీకి కేంద్ర ప్రభుత్వం చిన్నపాటి శుభవార్తను వినిపించింది. 14వ ఆర్థిక సంఘం కింద ఏపీకి రూ. 369 కోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరో రూ. 31.76 కోట్లను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. ఈ నిధుల కేటాయింపులపై ఏపీ మంత్రులు కాని, అధికారులు కానీ ఇంత వరకు స్పందించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles