Two dead, more than 210 injured in Taiwan quake ప్రకంపనల ధాటికి ఒరిగిన భవంతులు.. ప్రజల హాహాకారాలు

2 dead 177 missing after magnitude 6 0 quake strikes eastern taiwan

Earthquakes, Natural disasters, Accidents and disasters, Taiwan, Greater China, Asia, world news

Rescuers were working to reach five people trapped and more than 140 people unaccounted for in several buildings damaged by a strong earthquake near Taiwan's eastern coast.

ప్రకంపనల ధాటికి ఒరిగిన భవంతులు.. ప్రజల హాహాకారాలు

Posted: 02/07/2018 09:18 AM IST
2 dead 177 missing after magnitude 6 0 quake strikes eastern taiwan

అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ.. ఒక్కసారిగా ప్రకృతి ప్రళయరూపం దాల్చింది. దీంతో తూర్పు ఆసియా దేశం తైవాన్‌ ను వణికించింది. తైవాన్ లో భూమి కంపించింది. రిక్డరట్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంపం ధాటికి తైవాన్ తూర్పుతీరంలోని పట్టణమైన హువాలియెన్‌ లో భారీ భవంతులు, ఇతర నిర్మాణాలు కుప్పకూలాయి. ఒక్కసారిగా ఇళ్లలొంచి ప్రజలు హాహాకారాలు పెడుతూ భయటకు పరుగులు తీశారు.

అర్ధరాత్రి కావడంతో నిద్రలోకి జారుకున్న వందలాది మంది కూలిన భవంతుల్లో చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక్కసారిగా పట్టికుదిపేసిన భారీ భూకంపం ప్రభావంతో ఆ తరువాత వంద సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపసలు కూడా స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. వందలాది భవంతులు తమ స్థానాలనుంచి కదిలి నెలకొరిగే క్రమంలో వున్నాయి.

ఈ భూకంపం ధాటికి ఇప్పటికే నలుగురు మరణించారని అధికారులు చెప్పగా, సుమారుగా 177 మంది గల్లంతయ్యారని సమాచారం. దీనికి తోడు ఇప్పటికే 226 మంది ప్రజలు గాయాలపాలైయ్యారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు శిధిలావస్థలకు చేరుకుని కుప్పకూలడానికి సిద్దంగా వున్న భవంతుల్లో వున్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అయితే భూకంపం ధాటిక ఓ పక్కకు ఒరిగిన భవంతుల్లోకి ప్రజలు వెళ్లవద్దని.. అవి ఏ క్షణంలోనైనా కుప్పకూలవచ్చునని అధికారులు అదేశాలు జారీ చేశారు.

కాగా, హువాలియెన్‌ కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్‌ సొసైటీ తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఇక్కడి ప్రఖ్యాత మార్షల్‌ హోటల్‌ భవనం కూలిపోయిన దృశ్యాలు అత్యంత భీతిగొలిపించేలా ఉన్నాయి. తీవ్రమైన భూకంపం కావడంతో తైవాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన సహాయకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Earthquakes  Natural disasters  Accidents and disasters  Taiwan  

Other Articles