development speaks about rapaka sarpanch in AP గ్రామప్రగతికి నూతన భాష్యం చెప్పిన రాపాక..

Rapaka village development a talk of town in andhra pradesh

rapaka village development, rapaka inspiration, rapaka talk of the state, rapaka ratnamanikyam, rapaka best village, rapaka any bank service, rapaka solar units, rapaka swachh village, rapaka women empowerment, rapaka development, ratnamanikyam, sarpanch, iragavaram, inspiration, talk of town, andhra pradesh

How a small village rapaka in iragavaram mandal of west godavari district tunred out to be an inspiration for the state.

ITEMVIDEOS: రాపాకను మాణిక్యంలా తీర్చిదిద్దుతున్న అదర్శ సర్పంచ్ రత్నం

Posted: 02/07/2018 12:29 PM IST
Rapaka village development a talk of town in andhra pradesh

అంకుఠిత దీక్ష, పట్టుదల, అంచెలల అత్మవిశ్వాసం, నిస్వార్థ సేవ కలిగిన నాయకులతో జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం అవిష్కృతం అవుతుంది అనడానికి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ మారుమూల గ్రామమే నిదర్శనం. నాలుగేళ్ల క్రితం వరకు ఈ గ్రామం ఓ అనేక మారుమూల గ్రామాల్లో ఒక్కటి. కానీ నాలుగేళ్లగా ఈ గ్రామంలో అవిష్కృతమవతున్న అభివృద్ది పనులు ప్రగతిపథంలో పయనింపజేస్తున్నాయి. అందుకు కారణం.. గ్రామ సర్పంచ్ బృందావనం రత్నమాణిక్యం.

అన్ని గ్రామాల మాదిరిగా తమ గ్రామం కూడా ఒకటిగా ఏదో అంకెల అభివృద్దికి మాత్రమే పరిమితం కాకుండా అదర్శ, పారదర్శక అభివృద్ది దిశగా పరుగులు తీస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగాలన్న సర్పంచ్ కలలను సాకారం చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. తమ గ్రామాన్ని మట్టిలో మాణిక్యం లా కాకుండా నిజమైన మాణిక్యంలా ప్రగతిపథంలో పయనింపజేస్తూ ముందుకు కదులుతున్నారు సర్పంచ్ రత్నమాణిక్యం.

ఆదాయం కోసం పన్నుల బారం వేయకుండా..

గత సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గా గెలిచి గ్రామ అభివృద్ది పగ్గాలను చేతబట్టిన అమె.. అకుంఠిత దీక్షతో గ్రామాన్ని ముందుకు నడుపుతున్నారు. అమె సర్పంచ్ బాధ్యతలను చేతబట్టగానే ముందుగా గ్రామానికి రహదారుల నిర్మాణంతో .. డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు గ్రామంలోని మౌలిక సదుపాయాలపై అమె దృష్టి సారించారు. ప్రజల సహకారం ఎంత వున్నా.. గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు అధిక పన్నులు కట్టలేరని భావించిన అమె అదాయాన్ని మెరుగు పర్చుకునేందుకు పన్నలు భారం వేయకుండా నూతన మార్గాలను అన్వేషించారు.

గ్రామానికి వున్న అదాయాన్ని పెంచితే అది గ్రామాభివృద్దికి దోహదపడుతుందని భావించిన సర్పంచ్ రత్న మాణిక్యం..  గ్రామంలోని చెరువు గట్లతో పాటు రహదారులకు ఇరువైపులా వందల సంఖ్యలో మామిడి, టేకు, కొబ్బరి మొక్కలను నాటించి.. వాటికి పర్యవేక్షణ బాధ్యతలను కూడా తీసుకున్నారు. దీనికి తోడు పూల మొక్కలను కూడా నాటించారు. దీంతో గ్రామ పంచాయితీ అదాయం క్రమంగా పెరిగింది. పెరిగిన అదాయాన్ని కూడా గ్రామ ప్రగతికోసమే కాకుండా, గ్రామస్థుల అర్థిక స్వాలంభనకు శ్రీకారం చుట్టారు.

నాలుగేళ్ల ముందు సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టే నాటికి రెండు లక్షల రూపాయలుగా వున్న గ్రామ పంచాయితీ అదాయం ప్రస్తుతం పన్నెండు లక్షలకు చేరింది. రానున్న మరో నాలుగేళ్లలో గ్రామ పంచాయితీ అదాయాన్ని ఏకంగా ముఫై లక్షలుగా మార్చాలని రత్నమాణిక్యం లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. నాలుగేళ్లలో అరు రేట్లు అదాయం పెరగడంతో పాటు రాపాక శరవేగంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లడం కూడా ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాఫిక్ గా మారింది.

స్వచ్ఛ గ్రామం దిశగా..

ప్రధాని నరేంద్రమోడీ అందించిన స్వచ్చా భారత్ కార్యక్రమాన్ని తమ గ్రామంలో అచరించి చూపారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి మరుగుదోడ్లు వుండేలా చర్యలు తీసుకుని స్వచ్చా గ్రామంగా తీర్చిదిద్దారు. గ్రామంలో ఎక్కడా బహిరంగ బహిర్భూమికి వెళ్లకుండా గ్రామ ప్రజల్లో అవగాహన కలిగించడంత పాటు వాటిని అందరూ అచరించేలా చర్యలు చేపట్టారు. ప్రజల సహకారం లేనిదే ఏ కార్యక్రమం సఫలం కాదని నమ్మిన అమె ప్రజల్లో ముందుగా అవగాహనకు పెద్దపీట వేశారు.

ఇందుకు అమె ముందుగా గ్రామంలోని మహిళలకు అవగాహన కల్పించారు. ఇక ఇళ్లలోని చెత్తను కూడా తడి, పోడిగా విభజించడంతో ఎలా దోహదపడుతుందో కూడా వివరించారు. గ్రామస్థులు చెత్తను కూడా తడి, పోడిగా విభజిస్తూ పారిశుధ్య కార్మికులకు ఇస్తున్నారు. దీంతో స్వచ్ఛ గ్రామానికి దిశగా సర్పంచ్ చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇచ్చి.. రాపాకను రాష్ట్రంలోని ముందువరుసలో నిలిపింది.

మహిళా అర్థిక స్వాలంభన దిశగా..

గ్రామస్వరాజ్యం అంటే మాటలకు మాత్రమే పరిమితం అయ్యే పదంలా మిగలకుండా గ్రామంలోని స్త్రీశక్తిని కూడా అమె ఏకం చేశారు. గ్రామంలోని మహిళలకు అర్థిక స్వాలంభన దిశగా కూడా అడుగులు వేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమీకృత నైపుణ్యాభివృద్ది పథకం కింద మహిళలకు కుట్లు, అల్లికలతో పాటు పలు రంగాలలో వారికి శిక్షణ కల్పించారు. ఈ పథకంలో గ్రామంలోని సుమారు వెయ్యి మంది మహిళలు శిక్షణ తీసుకున్ని తమ అర్థికస్థితిని మెరుగుపర్చుకున్నారు.

మహిళలు తమ పనులు చేడగోట్టుకుని ఇలాంటి కార్యక్రమాలకు రావాలంటే సుముఖత చూపరని భావించిన సర్పంచ్ వారికి శిక్షణా కాలంలోని 20 రోజుల పాటు ప్రతీ ఒక్కరికి రోజుకు వంద రూపాయల స్టైఫండ్ ను కూడా ఇప్పించారు. దీంతో గ్రామంలోని మహిళలు తమ అదాయాన్ని పెంచుకోగలిగారు. ఈ తరహా గ్రామీణ అర్థిక స్వాలంభనకు సర్పంచ్ రత్నమాణిక్యం అలోచనే పునాది. అందుబాటులో వున్న కేంద్ర పథకాలను తమ గ్రామంలోని మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చిన అమె చిత్తశుద్దికి నిదర్శనం.

ఎనీ బ్యాంకు సేవలు..

గ్రామంలోని ప్రతీ కుటుంబం తమ అర్థిక స్థితిని మెరుగుపర్చుకున్న క్రమంలో.. వాటిని పొదుపు దిశగా మరల్చేందుకు కూడా గ్రామ సర్పంచ్ నడుంచుట్టారు. అయితే గ్రామంలో ఏ బ్యాంకు తమ శాఖలను, ఉపశాఖలను ఏర్పాటు చేయకపోవడంతో బ్యాంకు ప్రతినిధులను గ్రామానికి తీసుకువచ్చిన అమె.. గ్రామస్థుల పొదుపు విషయమై చర్చలు జరిపారు. బ్యాంకు లేని లోటుని తీర్చేందుకు కూడా అమె వినూత్న తరహాలో చర్యలు తీసుకున్నారు.

దీంతో ఏనీ బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకోచ్చారు. గ్రామస్ధులు పనులు మానుకుని బ్యాంకుల వరకు వెళ్లకుండా ఓ వ్యక్తిని బ్యాంకు లావాదేవీలను చూసుకునేలా.. బ్యాంకుల తరపున ప్రతినిధిగా నియమించారు. సదరు ప్రతినిధి గ్రామ ప్రజలు తాము తమ ఖాతాలలో జమ చేసే డబ్బును తీసుకెళ్లడంతో పాటు రోజుకు ఐదు వేల రూపాయలు మించకుండా గ్రామస్థులకు డబ్బు విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నాడు. ఇలా గ్రామస్థుల అభ్యున్నతి కోసం.. గ్రామ ప్రగతి కోసం అహర్నిషలు పాటుపడుతూ రాష్ట్రంలోని అపార అనుభవం గడించిన రాజకీయవేత్తలకు సైతం అదర్శప్రాయంగా నిలుస్తున్నారు సర్పంచ్ రత్నమాణిక్యం. అమె చేసిన అభివృద్ది ఏంటో రాపాక గ్రామమే చెబుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rapaka  ratnamanikyam  sarpanch  iragavaram  inspiration  talk of town  andhra pradesh  

Other Articles