TDP MLC Gali Muddu Krishnama Naidu passes away డెంగీ జ్వరంతో మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత

Tdp leader gali muddu krishnama naidu passes away

gali muddukrishnama naidu, muddukrishnama naidu no more, muddukrishnama naidu passes away, muddukrishnama naidu dengue fever, muddukrishnama naidu RIP, TDP, Chandra babu, dengue fever, Andhra pradesh, Andhra, India, News, Today, TS, AP, Latest, Update, Hyderabad

Former Telugu Desam Party (TDP) Minister and Andhra Pradesh MLC, Gali Muddukrishnama Naidu, died on Wednesday morning, after he succumbed to a heart attack. He was 71 years old.

డెంగీ జ్వరంతో మాజీ మంత్రి ముద్దుకృష్ణమ కన్నుమూత

Posted: 02/07/2018 08:34 AM IST
Tdp leader gali muddu krishnama naidu passes away

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు (71) గత అర్ధరాత్రి కన్నుమూశారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. వైద్యుల చికిత్సకు స్పందించని ఆయన.. అస్పత్రిలోనే అర్థరాత్రి  మృత్యువాతపడ్డారు. కాగా, గాలి ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్‌ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు.

విద్యాభ్యాసం తరువాత అధ్యాపక వృత్తిని స్వీకరించిన ఆయన, 1983లో దిగ్గజ నటుడు ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయరంగప్రవేశం చేశారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. ఈ క్రమంలో ఆయన వివిధ పదవులను అలంకరించారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2004 ఎన్నికలలో గెలిచారు. అయితే ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ తన మాతృ పార్టీలోకి వెళ్లారు.

2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సినీ నటి రోజా చేతిలో ఓటమిపాలయ్యారు. ఆయన పార్టీకి అందించిన సేవలకు గాను పార్టీ అధిష్టానం ఆయనను ఎమ్మెల్సీగా చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవిలోనూ కొనసాగుతూ మరణించారు. ఆయన మృతితో టీడీపీ ఒక సీనియర్ నేతను కోల్పోయింది. ఆయన మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్దుకృష్ణమ అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

కంటతటిపెట్టిన హరికృష్ణ

గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతిపై నందమూరి హరికృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించిన హరికృష్ణ.. మద్దుకృష్ణమ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణ వార్త విన్న వెంటనే షాక్‌కు గురయ్యనని తెలిపారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తననెంతో బాధించిందన్నారు. ఇది అన్నగారి పార్టీకి తీరని లోటని చెప్పారు.
 
1983లో ఎన్టీఆర్‌ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన ముద్దుకృష్ణమ.. అప్పటి నుంచి ఆయన ఎన్టీఆర్ తుదిశ్వాస విడిచే వరకు ఆయన వెంటే ఉన్నారన్నారు. తమ కుటుంబంతో ముద్దుకృష్ణమ ఎంతో సన్నిహితంగా ఉండేవారని చెప్పారు. ఎన్నో పదవులు చేపట్టిన ముద్దుకృష్ణమ వాటికి వన్నె తెచ్చారని అన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముద్దుకృష్ణమనాయుడు ఎంతో మంది యువ నాయకులకు ఆదర్శప్రాయుడని కొనియాడారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gali muddukrishnama naidu  TDP  Chandra babu  dengue fever  Andhra pradesh  

Other Articles