Lokesh trolled on social media again అమెరికాలోనూ చిన్నబాబుగారు నోరుజారారు..

Tdp will come to power even in america says minister nara lokesh

AP Minister, Nara Lokesh, Chandrababu, chief minister, Nara Lokesh trolled on social media, nara lokesh netzens, nara lokesh american elections, nara lokesh, social media platforms, viral video. Andhra Pradesh, Politics

Andhra Pradesh Minister and son of CM Chandrababu Nara Lokesh has been trolled on social media platforms once again by saying his party to win in the US, as Netizens have been sharing the video.

ITEMVIDEOS: మళ్లి నోరుజారిన మంత్రి లోకేష్.. సెటైర్లు విసురుతున్న నెట్ జనులు

Posted: 02/06/2018 05:12 PM IST
Tdp will come to power even in america says minister nara lokesh

అమెరికాలోని న్యూజెర్సీ పర్యటనలో వున్న టీడీపీ మంత్రివర్యులు, అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అక్కడ చలోక్తిగా విసిరిన పదంపై నెట్ జనులు సెటైర్లు విసురుతున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుముందు నారా లోకేష్ పార్టీ వ్యవహారాలను చూసుకునేవారు. అయితే ఈ క్రమంలో ఆయన పలు పర్యాయాలు నాలుక జారారు. అయితే మంత్రి అయిన తరువాత మాత్రం ఆయన ఒకటికి రెండు పర్యాయాలు అలోచించి ప్రసంగిస్తున్నారు. ఇది స్టేజ్ ఫియర్ వల్ల వచ్చిందో లేక మరేవిషయం కారణమో కానీ.. తాజాగా అమెరికాలో ఆయన విసిరిన చలోక్తిని కూడా నెట్ జనులు నోరుజారినట్లు భ్రమపడుతున్నారు.

అగ్రరాజ్యంలోని ఎన్ఆర్ఐ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులను చూసి.. పార్టీ కార్యకర్తలు, శ్రేణుల ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చేలాగుందని చలోక్తి విసిరారు. పార్టీ కార్యకర్తలలో జోష్ పేంచేందుకు నాయకులు ఇలాంటి చలోక్తులు అనేకం విసరడం కామన్. అయితే అయనకు అమెరికాలో ఓటింగ్ విధానం, సరళి గురించి తెలియక, ఏపీ తరహాలోనే ఇక్కడ కూడా వుంటుందనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.

నిజానికి లోకేష్ నాలుక జారలేదు.. సరికదా.. మంచి ఉద్దేశ్యంతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు టీడీపీ నేతలు ఇలాంటి ప్రచారకర్తలపై తమదైన శైలిలో బదులిస్తున్నారు. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని కౌంటర్ ఇస్తున్నారు. అయినా అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసించిన నారా లోకేష్ కు అక్కడి బైలేటరల్ ఎన్నికల విధానం గురించి.. పోటీల గురించి తెలియక పోవడమేంటని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  social media  trolled  viral video. Andhra Pradesh  Politics  

Other Articles