Medaram liquor sales fetch state Rs 50 crore తెలంగాణ కుంభమేళాలో పొంగిపోర్లిన మద్యం..

Medaram liquor sales fetch state rs 50 crore

Medaram Jatara, sammakka sarakka jatara, liquor sales, fowls, jaggery, license to sale liquor, medaram jatara liquor sales, illicit liquor, excise department, income to government, telangana

liquor sales Medaram sammakka sarakka jatara fetches the state government Rs 50 Cr only with four bars and 22 wines with a licence fee of Rs. 9000.

తెలంగాణ కుంభమేళాలో పొంగిపోర్లిన మద్యం.. కోట్ల అదాయం..

Posted: 02/05/2018 12:33 PM IST
Medaram liquor sales fetch state rs 50 crore

తెలంగాణ కుంభమేళ.. ప్రతీ రెండేళ్ల ఓ పర్యాయం జరిగే గిరిజన దేవతల జాతరలో మధ్యం పొంగిపోర్లింది. గత ఏడాది కంటే అధికంగా మద్యం అమ్మాకాలు జరిగాయి. సమ్మక్క, సారక్క జాతరలో సర్వసాధారణంగా బెల్లం, కొడిపుంజుల అమ్మాకాలు సాగుతుంటాయి. అయితే మద్యం ప్రియులు మాత్రం ఈ జాతరలో బంధుమిత్రులతో కలసి మద్యం సేవిస్తుంటారు. అడవారు అమ్మవారికి సమర్పించిన కోళ్లు, బెల్లాన్ని తమ వంటకాలతో కలసి వండుతున్న క్రమంలో మగవారు అందులోనే మధ్యం ప్రియులు మాత్రం పక్కనే తమ పని కానిచ్చేస్తుంటారు.

ఈ క్రమంలో తెలంగాణ కుంభమేళాలో మద్యం అమ్మకాల  డిమాండ్ పెరుగగా, అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ భారీ ఆదాయాన్ని పొందింది. . దీంతో ప్రతీ పర్యాయం ఎప్పటిక్కప్పుడు అమ్మాకాలను తగ్గట్టుగా సప్లై ముందుగానే సమకూర్చుకుంటారు. జాతర నేపథ్యంలో కేవలం ఏడు రోజులు మాత్రమే అమ్మాకాలను సాగించేందుకు ప్రభుత్వ స్థానిక గిరిజనులకు ప్రత్యేకంగా అనుమతులను ఇస్తుంది. ఇలా ఏడాదికేడాది పెరుగుతున్న లైసెన్సుల సంఖ్య ఈ ఏడాదికి వచ్చే సరికి 22 బార్లకు అనుమతులిచ్చారు.

దీంతో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ క్రమంలో ఈ బార్లతో వారం రోజుల వ్యవధిలో రూ. 4 కోట్ల మేర అదాయాన్ని అర్జించగా, ఇక చుట్టుపక్కనున్న వరంగల్. వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, కొత్తగూడెం, అదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి సహా పలు జిల్లాలోని మద్యం దుకాణాల ద్వారా మొత్తంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ 50 కోట్ల రూపాయల అదాయాన్ని ఈ జాతర ద్వారా సమకూర్చుకుంది ఎక్సైజ్ శాఖ.

ఈ క్రమంలో కనీస ధరలకు తూట్లు పెడుతూ మధ్యం దుకాణ వ్యాపారులు తమ ఇష్టానుసారరం ధరలను నిర్ణయించుకుని అమ్మాకాలు చేపట్టారు. ఇంత భారీ స్థాయిలో మేడారం జాతరల్లో అమ్మకాలు ఎన్నడూ సాగలేదని అధికారులు అంటున్నారు. కాగా గత పర్యాయం కన్నా ఈ సారి రూ. 3 కోట్ల పైచిలుకు రూపాయల అమ్మాకాలు అధికంగా సాగాయని ఎక్సైజ్ అధికారుల గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక జాతర ముసుగులో అక్రమ సారా కూడా రాజ్యమేలిందన్న అరోపణలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medaram Jatara  sammakka sarakka jatara  liquor sales  fowls  jaggery  excise department  telangana  

Other Articles