Indian Army Says 'Action Will Speak For Itself' ‘‘పాకిస్థాన్ కు మాటలతో కాదు చేతలతోనే బదులు’’

Action will speak for itself army on pakistan s aggression killing 4 soldiers

Captain Kapil Kundu, ceasefire violation, indian army, Jammu and Kashmir, Pakistan, RAJOURI, Indian Army, soldiers martyred, Pakistani aggression, J and K, India Army

The Army said today that "it goes without saying" it will retaliate against Pakistan's ceasefire violations yesterday and when it does, "action will speak for itself",

‘‘పాకిస్థాన్ కు మాటలతో కాదు చేతలతోనే బదులు’’

Posted: 02/05/2018 01:14 PM IST
Action will speak for itself army on pakistan s aggression killing 4 soldiers

భారత ఆర్మీ సెక్టార్‌పై తూటాల వర్షం కురిపించి నలుగురు జవాన్లను హతమార్చిన పాకిస్థాన్ అర్మీ, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తాము మాటలతో కాదు, చేతలతోనే పాక్ కు సమాధానం చెబుతామని భారత ఆర్మీ ప్రతీణ భూనుతుంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత అర్మీకి చెందిన నలుగరు జవాన్లు మరణించారు. వారిలో ఒక అర్మీ అధికారి కూడా వున్నారు. గత 40 రోజులుగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పోడుస్తే జరుపుతున్న కాల్పుల్లో ఆర్మీ అధికారి చనిపోవడం ఇది రెండవసారి.

భారత-పాక్ సరిహద్దుల్లోని సందర్బని ప్రాంతంలో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడి అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లను బలితీసుకుంది. పాక్ కాల్పుల ఘటనలో ఆర్మీ సెకెండ్ ఆఫీసర్ కెప్టెన్ కపిల్ కుందు అమరుడు కాగా, జవాన్లు రైఫిల్ మ్యాన్‌లు రామ్ అవతార్, శుభం సింగ్, హవల్దార్ రోషన్ లాల్, జవాను నియాక్ ఇక్బాల్ అహ్మద్‌లు కూడా హతులయ్యారు. కాగాబీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గాయపడ్డారు. దీంతో అగ్రహంతో రగిలిపోతున్న భారత ఆర్మీ పాకిస్తాన్ పై మాటలతో కాకుండా చేతలతోనే ప్రతీకారం తీర్చుకుంటామని  స్పష్టం చేసింది.

‘‘ప్రతీకారం అన్నది మాటల రూపంలో కాకుండా జరిగిపోతుంది. దాని గురించి నేను చెప్పను. చేతలతోనే దానికి బదులిస్తాం’’ అని ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ అన్నారు. జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్ లో నిన్న పాకిస్థాన్ దళాల కాల్పులకు నలుగురు భారత జవాన్లు నెలకొరగడంతో దీనిపై ఆర్మీ జవాన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్థాన్ చర్యలను క్షమించేది లేదని, దీనికి ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ అహిర్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Army  soldiers martyred  Pakistani aggression  Jammu and kashmir  J and K  India Army  

Other Articles