Twitter User Finds A Used Bra In A Primark Garment Store 2.45 లక్షల లైక్స్ తో యువతి అనుభవం నెట్టింట వైరల్.!

This hilarious bra shopping story is leaving people traumatised

bra, glasgow, natalie brayshaw, primark garment store, primark store, twitter, netzens, garment stores, social media, natalie experiance, fashion, favorite hub, shopaholics

A recent post on Twitter made the Twitterati go cringe in no time. On January 31, an active user named Natalie (@n_brayshaw) posted a tweet, that traumatized other ladies related to their involvement at different garment stores.

2.45 లక్షల లైక్స్ తో యువతి అనుభవం నెట్టింట వైరల్.!

Posted: 02/05/2018 11:28 AM IST
This hilarious bra shopping story is leaving people traumatised

మహిళలకు షాపింగ్ కు మధ్య వున్న అనుబంధం విడదీయలేనిది. అది అనకాపల్లి అయినా లేక అమెరికా అయినా సేమ్ టు సేమ్ థీయరీ.. అయితే డ్రెసింగ్ లో మాత్రం కొంత చేంజ్. ఈ ఫార్ములాను అందిపుచ్చుకున్న స్కాట్ లాండ్ లోని గ్లాస్ కోకు చెందిన నటాలీ బ్రయిషా అనే యువతి స్థానికంగా కాలేజీ విద్యను అభ్యసిస్తుంది. ఈ క్రమంలో అమె గత నెల చివరి రోజున ఒక ట్విట్ ను తన అకౌంట్ లో పోస్టు చేసింది. అంతే ఒకరు కాదు ఇద్దరు కాదే మొత్తం.. మహిళా లోకం కదిలింది. ఎంతలా అంటే నటాలీకి ఎదురైన అనుభవం తమకు ఎదురైనంతగా ఫీలయ్యారు మహిళా లోకం.

అదేంటి అడవారికి అడవారే శత్రువులు అన్న నానుడి వుందిగా, దానిని తలకిందులు చేస్తూ ఓ యువతి ట్విట్ కు ఇంత పెద్ద ఎత్తున్న మహిళా స్పందనా..? అని అశ్చర్యపోతున్నారా.? అవును. అందులోనే ఇది మహిళల షాపింగ్ అంశానికి సంబంధించినది కావడంతో.. మరింత పెద్ద ఎత్తున్న స్పందన వెల్లివిరుస్తుంది. అసలు ఇంతకీ ఆ యువతికి ఎదురైన అనుభవమేంటి అంటారా.? ఓ వస్త్ర దుకాణానికి అమె తనకు నచ్చిన లోదుస్తులు తీసుకున్న తరువాత షాక్ కు గురైంది. ఎందుకంటే..

స్కాట్ ల్యాండ్ లోని గ్లాస్ కో.. ప్రైమాక్స్ స్టోర్ కు నతాలీ వెళ్లింది. అక్కడ లోదుస్తుల కోసం ఆమె వెతుకుతుంటే, మనసుకు నచ్చిన బ్రా కనిపించింది. అది తనకు బాగా నచ్చింది. ట్రయల్ రూమ్ లోకి వెళ్లి చూస్తే.. సరిగ్గా ఫిట్ అయ్యాయి. దీంతో తృప్తి పడిన అమె.. బిల్లింగ్ కౌంటర్ వద్దకు వెళ్లింది. దానిపై ప్రెస్ ట్యాగ్ లేకపోవడంతో దాని ధరను తెలుసుకునేందుకు అక్కడి సేల్స్ బాయ్ ను సంప్రదించింది. అతను అతను కూడా కాసేపు అటూ ఇటూ తిరిగి చేసేది లేక చివరకు సూపర్ వైజర్ ను సంప్రదించాడు.

సూపర్ వైజర్ తనకు చెప్పిన సమాధానం విన్న సెల్స్ బాయ్.. యువతికి దాని ధర చెప్పలేదు.  యువతి మాత్రం ఎంత.. ఎంత అంటూ అడిగింది. చివరకు క్షమించండి... "ఇది మా షాప్ లోని బ్రా కాదు. దీన్ని ఎవరో కావాలనే ఇక్కడ వదిలెళ్లారు. ఎవరో వాడేసిన బ్రా హ్యాంగర్ కు తగిలించి, కొత్తది తీసుకుపోయారు" అని చెప్పాడు. ఇక ఎవరో వాడేసిన బ్రాను తాను ధరించి చూసుకుని, తెచ్చానా? అంటూ నతాలీ తన అనుభవాన్ని ట్విట్టర్ లో తెలిపింది.

ఇక ఆమె ట్వీట్ తరువాత వేలాది మంది స్టోర్స్ లో తమకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఇక అటు దుకాణం నిజాయితీని కూడా కొనియాడుతున్నారు. జనవరి 31న ఆమె ఈ పోస్టును పెట్టగా, సుమారు రెండున్నర లక్షల మంది లైక్ కొట్టారు. మరో 48 వేల మంది ఈ ట్వీట్ కు రీట్వీట్ చేశారు. ఇందులో కొందరు మగరాయుళ్లు కూడా జోక్యం చేసుకుంటూ వారికి షాపింగ్ పై వున్న శ్రద్దతో పాటు హస్యచతరురను కూడా ప్రదర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles