Congress Leads In Alwar, Ajmer Lok Sabha Seats బీజేపిని బొల్తాకొట్టించి.. ముందంజలో కాంగ్రెస్..

Congress leads in alwar ajmer lok sabha seats

Rajasthan, West Bengal By-elections results 2018 Live Updates, Noapara, Ulberia, Alwar, Azmer, and Mandalgarh, Congress, BJP, Vasundhara Raje, By-elections 2018, Rajasthan, By election West Bengal, Uluberia, Noapara, Congress, BJP, Alwar Ajmer

A 32-year-old man employed in a garments firm was arrested for harassing actress Amala Paul, when she was at a dance school in T Nagar

బీజేపిని బొల్తాకొట్టించి.. ముందంజలో కాంగ్రెస్..

Posted: 02/01/2018 10:10 AM IST
Congress leads in alwar ajmer lok sabha seats

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపి పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మానియాకు పెట్టింది పునాదిగా నిలిచిన అయన సొంత రాష్ట్రంలో తన పట్టుకు చావు తప్పి కన్నులోట్టపోయిందన్నట్లుగా చేసిన కాంగ్రెస్.. అక్కడి ప్రజలు అందించిన అదరణతో నూతన జవజీవాలను అందిపుచ్చుకుంది. ఆ తరువాతే కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికార పగ్గాలను అందిపుచ్చుకున్న రాహుల్ గాందీ కూడా బీజేపిపై తనదైన శైలితో విమర్శలు చేస్తూ.. బీజేపి ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని ఇరుకున పెడుతున్నారు.

ఇక అదే జోష్ లో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో రాష్ట్ర నుంచి కూడా మహాదారణ లభిస్తుంది. అదే రాజస్తాన్. గుజరాత్ తో హోరాహోరీ పోటీనిచ్చి ప్రధాని మోదీకి చెమటలు పోయించిన కాంగ్రెస్ కీలకమైన రాజస్థాన్ లోనూ తన సత్తా చాటుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

రాజస్థాన్, పశ్చిమబెంగాల్లోని పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా రాజస్థాన్ లోని ఆళ్వార్, అజ్మీర్ ఈ రెండు లోక్ సభ స్థానాలను గతంలో బీజేపీయే కైవసం చేసుకోగా, తాజాగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారు. అళ్వార్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ యాదవ్ 10,000 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. అజ్మీర్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రఘు శర్మ 8,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

అయితే, ఇదే రాష్ట్రంలోని మండల్ గఢ్ అసెంబ్లీ స్థానంలో మాత్రం బీజేపీ అభ్యర్థి 3,072 ఓట్ల మెజారిటీతో ఉండడం కాస్తంత ఊరట. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల ముందు జరిగే వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తారు. అటువంటి చోట కాంగ్రెస్ సత్తా చాటడం బీజేపీ వ్యతిరేక పవనాలను సూచిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ లోని ఉలుబేరియా లోక్ సభ స్థానంలో తృణమూల్ ముందంజలో ఉంది. ప్రస్తుతం ఈ స్థానం తృణమూల్ కోటాలోనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నోపర అసెంబ్లీ స్థానంలోనూ తృణమూల్ అభ్యర్థే ముందంజంలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : By-elections 2018  Rajasthan  West Bengal  Uluberia  Noapara  Congress  BJP  Alwar Ajmer  

Other Articles