india fifth largest economy in the world soon త్వరలో ప్రపంచ ఐదో అర్థిక వ్యవస్థగా భారత్: అరుణ్ జైట్లీ

India emerges as fifth biggest economy in the world says arun jaitley

arun jaitley, budget, Budget 2018, Budget 2018 Live, Budget session, income tax, lok sabha, Narendra Modi, parliament, rajya sabha, Union Budget, Union Budget 2018, Union Budget 2018-19

India achieved an average growth of 7.5% growth in the last 3 years. We are the third-largest economy in terms of purchasing power parity and seventh largest economy in the world in terms of growth says union finance minister arun jaitley in his budget presentation fo the 2018-19 fiscal year.

ITEMVIDEOS: త్వరలో ప్రపంచ ఐదో అర్థిక వ్యవస్థగా భారత్: అరుణ్ జైట్లీ

Posted: 02/01/2018 11:38 AM IST
India emerges as fifth biggest economy in the world says arun jaitley

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం సంస్కరణలతో భారత అర్థికవ్యవస్థను గాడినపెట్టిందని నిత్యం శ్రమిస్తుందని, ఈ క్రమంలో పాలసీలోపాల ఇబ్బంది పడుతున్నా ముందుకు దూసుకుపోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఫలితంగా దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఎఫ్ డీఐల నిబంధనల సరళీకరణ, సహజవనరుల కేటాయింపులో పారదర్శికత పాటించామని తెలిపారు.

జీఎస్టీ పరోక్ష పన్నుల వ్యవస్థను కేంద్రం మరింత సులభం చేసిందన్నారు. త్వరలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా జీఎస్టీ పరధిలోకి తీసుకువస్తామన్నారు. దీంతోపాటు నోట్ల రద్దు వంటి చర్యలు భారత్‌ ఆర్థిక వ్యవస్థను మధ్య, దీర్ఘకాలంలో మరింత బలోపేతం చేస్తాయని అశాభావం వ్యక్తం చేశారురు. ఇప్పటికే భారత్‌ ప్రస్తుతం భారత్‌ ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని.. త్వరలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. కోనుగోలు శక్తి ఆధారంగా భారత్‌ ఇప్పటికే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందిని చెప్పుకోచ్చారు.

ఈ ఆర్థిక ద్వితీయార్థంలో జీడీపీ వృద్ధి 6.3శాతంగా నమోదైంది. ఇది 7.2 నుంచి 7.5శాతం వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. కొత్త సంస్కరణలతో అవినీతి తగ్గే అవకాశం ఉందని జైట్లీ తెలిపారు. గత కొన్నేళ్లుగా తెస్తున్న సంస్కరణలు ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తాయన్నారు. డిజిటలైజేషన్ తో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత ఏర్పడిందని తెలిపారు. బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణ కొత్త సంస్కరణలకు నాంది పలికిందని జైట్లీ పేర్కొన్నారు.

జైట్లీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే:

* వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం.
* వచ్చే ఏడాది వృద్ధిరేటు 7.4శాతంగా ఉంటుందని అంచనా.
* భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా నిలబడింది.
* త్వరలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఆవిర్భవించనుంది.
* తయారీ రంగం తిరిగి పట్టాలెక్కింది. 8శాతం వృద్ధి దిశగా అడుగులేస్తోంది.
* రెండ్రోజుల్లో పాస్‌పోర్ట్ మంజూరు, ఒక్కరోజులోనే కంపెనీ రిజిస్టేషన్లు మన విజయాలు.
* నగదు బదిలీ పథకంతో ప్రపంచానికి భారత్‌ కొత్త విజయ పాఠం నేర్పుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitley  Union Budget 2018  income tax  lok sabha  Narendra Modi  parliament  

Other Articles