Hello Heroine Kalyani Number is Mine! అక్కినేని నాగార్జనపై జార్ఖండ్ వాసి కేసు..

Jharkahnd man files case against hello movie in court

Akkineni Nagarjuna, Vikas Prajapathi, Akkineni Akhil, Jharkhand Man, Annapoorna Studios, Hello Movie, Rs.50 Lakhs compensation, phone number, permission, embarasment, legal notices, jharkhand coourt

Now a man Vikas Prajapathi from Jharkhand filed a case on Annapoorna Studios claiming Rs.50 Lakhs as compensation as they have used his phone number without his permission and enormous number of calls embarassed him.

అక్కినేనికి లీగల్ నోటీసులు.. కోర్టుకెక్కిన జార్ఖండ్ వాసి..

Posted: 01/25/2018 11:21 AM IST
Jharkahnd man files case against hello movie in court

సినిమాలపై కేసులు వేయడం ఈ మధ్యకాలంలో కామన్ విషయం అయిపోయింది. తాజాగా విడుదులైన పద్మావత్ చిత్రం విడుదలపై కూడా ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా అశ్రయించి చిత్ర విడుదలను నిలుపుదల చేయాలని పలు సంఘాలు యత్రించాయి. అయితే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా కేసు నమోదైంది.

ఏదేని చిత్రం విడుదలయ్యే ముందు వరకు మాత్రమే న్యాయస్థానాలను అశ్రయించడం జరుగుతుంది. కానీ నాగార్జున నిర్మించిన చిత్రం హలో మాత్రం విడుదలైన తరువాత కూడా న్యాయస్థానాల్లో కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తనను అక్కినేని నాగార్జున చాలా ఇబ్బంది పెట్టారని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వికాస్ ప్రజాపతి కోర్టుకెక్కినట్టు తెలుస్తోంది. తన పనికి అంతరాయం కలిగేలా నాగార్జున చేయడం వల్ల.. తాను చాలా నష్టపోయానని తన పిటీషన్ లో పేర్కొన్నాడు.

తనకు జరిగిన ఇబ్బందికి పరిహారంగా 50 లక్షల రూపాయలు చెల్లించాలని  అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా విడుదలైన 'హలో' సినిమాలో హీరోయిన్ కల్యాణి ఫోన్ నంబర్ తాను వాడుతున్న నంబర్ ఒకటే కావడంతో పలువురు అభిమానులు ఫోన్ చేసి, 'కల్యాణివేనా? ఏం చేస్తున్నావ్?' అంటూ విసిగిస్తున్నారని వాపోయాడు. కాగా, దీనిపై స్పందించిన నాగ్... తాము టెలికాం ఆపరేటర్ అనుమతి తీసుకున్నాకే సినిమాలో ఆ నంబర్ ను వినియోగించుకున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles