UDAN 2 to link 73 airports, helipads తెలుగురాష్ట్రాల నుంచి కొత్త విమానమార్గాలు..

Helicopters to fly under udan scheme as pawan hands wins contract in round two

UDAN scheme, UDAN regional connectivity scheme, pawan, helicopters, new airline routes, spicejet, indigo, telugu states, hyderabad, tirupati, ashok gajapathiraju, hubli, kolhapur, nasik, sholapur

Unlike round one when no bids were received from the helicopter operators under the regional connectivity scheme, phase 2 has received proposals from the helicopter flyers.

ఉడాన్ 2: తెలుగురాష్ట్రాల నుంచి కొత్త విమానమార్గాలు..

Posted: 01/25/2018 12:04 PM IST
Helicopters to fly under udan scheme as pawan hands wins contract in round two

దేశవాళీ విమానయాన రంగం విస్తరణే లక్ష్యంగా నిర్ధేశించుకున్న కేంద్రం.. సామాన్యులకు కూడా విమానయాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రచారం చేసి ఆ మేరకు 'ఉడ్ దేశ్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) పేరిట ఓ పథకాన్ని కూడా ప్రారంభించిన విషయం తెలిసింది. తాజాగా ఈ పథకంలో భాగంగా ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా పథకాన్ని విస్తరిస్తూ, 325 కొత్త మార్గాలను ప్రకటించింది. వీటితో పాటు కొత్తగా 56 విమానాశ్రయాలను, హెలిపాడ్లను ఈ స్కీమ్ కిందకు చేర్చింది.

ఉడాన్ రెండో రౌండ్ బిడ్డింగ్ లు ముగిసిన తరువాత, 15 సంస్థలకు వివిధ రూట్లను కేటాయిస్తూ విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు ఆదేశాలు జారీ చేశారు. వీటిల్లో హైదరాబాద్, తిరుపతి నుంచి కొత్త రూట్లు కూడా వచ్చాయి. జమ్మూలోని కార్గిల్ కూ, రైలు, రోడ్డు మార్గాలు సరిగ్గా లేని కొండ ప్రాంతాలకు, ఈశాన్య రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం దక్కింది. ఇండిగోకు కొత్తగా 20 రూట్లకు, స్పైస్ జెట్ కు 17 రూట్లకు అనుమతులు లభించాయి.

ఈ రూట్లలో విమానాలు 50 శాతం సీట్లను ఉడాన్ పథకం కింద, గంట ప్రయాణానికి గరిష్ఠంగా రూ. 2,500 మించి కస్టమర్ల నుంచి వసూలు చేయరాదన్న కేంద్ర నిబంధన కూడా వుంది. దీంతో ఈ రూట్లలో సీటు అక్సూపెన్సీ, సహా లాభాలను అర్జించేవరకు విమానయాన సంస్థలు నష్టపోయే మొత్తం కోసం రూ. 620 కోట్లు కేటాయించామని, ఈ రూట్లు వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని అశోక్ గజపతిరాజు తెలిపారు. ఇక హెలికాప్టర్ లు అయితే, అరగంటకు రూ. 2,500 మించకుండా వసూలు చేయవచ్చు.

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త మార్గాలివే:

ఇక తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కొత్త మార్గాల్లో భాగంగా హైదరాబాద్ నుంచి హుబ్లీ, కొల్హాపూర్, నాసిక్, షోలాపూర్, కొప్పళ్ పట్టణాలకు విమానాలు తిరగనున్నాయి. తిరుపతి నుంచి కొల్హాపూర్, హుబ్లీ పట్టణాలకు రూట్ క్లియర్ అయింది. డర్బో ఏవియేషన్, అలయన్స్ ఎయిర్, స్పైస్ జెట్, ఇండిగో విమానాలు ఈ సర్వీసులను తిప్పుతాయి.

మిగతా మార్గాల్లో ముఖ్యమైన వాటిల్లో దర్బంగా - బెంగళూరు, కార్గిల్ - శ్రీనగర్, హుబ్లీ నుంచి అహ్మదాబాద్, చెన్నై, కొచ్చిన్, గోవా, జైసల్మేర్ నుంచి సూరత్, ఉదయ్ పూర్, అహ్మదాబాద్, వెల్లూరు నుంచి బెంగళూరు - చెన్నై తదితరాలున్నాయి. పర్వత సాణువుల్లోని కులు, మనాలి, సిమ్లా, ధర్మశాల, హరిద్వార్, జోషిమణ్, డెహ్రాడూన్ ప్రాంతాల మధ్య హెలికాప్టర్ సర్వీసులు నడుస్తాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles